ETV Bharat / city

జేఈఈ విద్యార్థులకు శుభవార్త.. ఇక మెయిన్స్​ పరీక్ష తెలుగులో - జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ వార్తలు

ఇంటర్​ విద్యార్థులకు శుభవార్త. జేఈఈ మెయిన్స్ ఇక మీదట తెలుగులో కూడా నిర్వహించనున్నట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. 2021 నుంచి మొత్తం 11 భాషల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

జేఈఈ విద్యార్థులకు శుభవార్త.. ఇక మెయిన్స్​ పరీక్ష తెలుగులో

author img

By

Published : Nov 28, 2019, 11:30 AM IST

జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ మెయిన్స్) ఇక మీదట తెలుగుభాషలో కూడా జరగనుంది. ఈ పరీక్షను మొత్తం 11 భాషల్లో నిర్వహించడానికి మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) సిద్ధమవుతోంది. అస్సామీ, బెంగాలీ, ఆంగ్లం, గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, ఒడియా, తమిళ్​, తెలుగు, ఉర్ధూ భాషల్లో పరీక్షను నిర్వహించనున్నారు.

2021 నుంచి అమలు

ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ భాషల్లో మెయిన్స్ నిర్వహిస్తున్నారు. గుజరాతీకి ప్రాాధాన్యం ఇచ్చినట్లుగా ఇతర భాషలకు ఇవ్వాలని ఇటీవల పశ్చిమబంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కేంద్రాన్ని అభ్యర్థించారు. దీనిని పరిశీలించిన కేంద్రం.. 11 భాషల్లో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. 2020కి ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసినందున 2021 నుంచి ప్రాంతీయ భాషల పరీక్షా పత్రం రూపొందించనున్నారు.

ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కళాశాలల్లో సీటు పొందేందుకు జేఈఈ మెయిన్స్​ పరీక్ష రాయడం తప్పనిసరి. ఇందులో మార్కుల ఆధారంగానే ఐఐటీల్లోనూ ప్రవేశం లభిస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పరీక్ష రాసేవారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ర్యాంకులు సాధించేవారు కూడా ఈ రెండు రాష్ట్రాల నుంచే అధికంగా ఉంటున్నారు.

ఇదీ చూడండి:

ఇంజినీరింగ్​ కళాశాలల నిర్వహణపై సీఎంకు నివేదించనున్న కమిషన్​

Intro:tg_nlg_213_25_mandakrishna_sangeebavam_ab_TS10117
నల్గొండ జిల్లా నార్కట్పల్లి డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ 7000 కోట్ల నష్టాల్లో ఉన్నప్పటికీ.. ప్రభుత్వంలో విలీనం చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయని, మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ లో విలీనం ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని అన్నారు. Body:Shiva shankarConclusion:9948474102
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.