ETV Bharat / city

NADENDLA MANOHAR : 'అత్యధిక స్థానాలు గెలిచిన ప్రభుత్వానికి.. ఇంత వ్యతిరేకత నా జీవితంలో చూడలేదు'

author img

By

Published : Jan 3, 2022, 4:32 PM IST

తెనాలిలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా.. ప్రజల ఖాతాల్లో ఎంత నగదు జమ చేశారనేది పుస్తకం పంపిణీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో పుస్తకానికి రూ.300 వెచ్చించి ప్రభుత్వ ధనాన్ని వృథా చేశారని మండిపడ్డారు.

జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా.. ప్రజల ఖాతాల్లో ఎంత నగదు జమ చేశారో చెప్పడానికి పుస్తకాలు పంపిణీ చేశారని, తద్వారా ప్రజాధనాన్ని వృథా చేశారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఒక్కో పుస్తకానికి రూ.300 వెచ్చించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పుస్తకాలను పంపిణీ చేయడానికి వాలంటీర్లను వినియోగించడం దుర్మార్గం అని ఆక్షేపించారు. అదే రీతిలో ఇసుక, మద్యం, దోపిడీ, భూకబ్జాలు, రోడ్ల మరమ్మతులు, రైతుల కోసం ఏం చేశారు..? అనే విషయాలను ప్రస్తావిస్తూ పుస్తకరూపంలో ప్రచురించి ప్రజలకు పంపిణీ చేయాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.

ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు..
గుంటూరు జిల్లా తెనాలిలోని పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ సమావేశం ఏర్పాటు చేశారు. నూతన సంవత్సరంలో పాలకులు అంకిత భావంతో ప్రజల కోసం పనిచేయాలని ఆకాంక్షించారు. కేంద్రం ఇచ్చిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులనూ ప్రభుత్వం లాక్కొని ఆర్థిక సంక్షోభం సృష్టించిందని, సర్పంచ్​లకు చెక్ పవర్ తీసేసి అభివృద్ధి నిరోధకాలుగా ప్రభుత్వం మారిందని విమర్శించారు. సంక్షేమం, అభివృద్ధి రెండూ జరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుందని సూచించారు. మరోపక్క ఉద్యోగాలు లేక యువత వేరే రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి తలెత్తిందని నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజల ఖాతాల్లో ఎంత నగదు జమ చేశారనేది పుస్తకం పంపిణీ చేశారు. ఒక్కో పుస్తకానికి రూ.300 వెచ్చించి ప్రభుత్వ ధనాన్ని వృథా చేశారు. ఇసుక, మద్యం విక్రయాలనూ ప్రచురించి పంపిణీ చేయాలి. ఉద్యోగాలు లేక యువత వేరే రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. - నాదెండ్ల మనోహర్, జనసేన నేత

పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో నిరసన..
రైతన్నలకు మద్దతుగా... రానున్న రోజుల్లో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో గుంటూరులోని కలెక్టరేట్ ముందు నిరసన ప్రదర్శన చేపడతామని నాదెండ్ల అన్నారు. రైతులు రైతు భరోసా కేంద్రానికి వెళితే అవమానమే ఎదురవుతోందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతారన్న నమ్మకంతో ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చారని.. కానీ ప్రస్తుతం ప్రజలను మోసం చేసే విధంగా పరిపాలన ఉందని పేర్కొన్నారు.

నియామక పత్రాలు అందజేత..
మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో... నూతనంగా నియమించిన మండల అధ్యక్షులకు నాదెండ్ల మనోహర్ నియామక పత్రాలు అందించారు. వచ్చే మార్చిలో పార్టీ సభ్యత్వం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మహిళ, యువత కమిటీలు నియమిస్తున్నామన్నారు. ధరలు తగ్గిస్తామని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్... ప్రజలను మోసం చేశారన్నారు. అత్యధిక స్థానాలు గెలిచిన ప్రభుత్వం కేవలం రెండున్నరేళ్లలో ఇంత వ్యతిరేకత రావడం తన రాజకీయ జీవితంలో చూడలేదన్నారు.

151 సీట్లతో ప్రజలు గెలిపిస్తే.. వర్క్ ఫ్రం హోం అంటూ సీఎం ఎందుకు ఇంట్లోనే ఉంటున్నారు. సంక్రాంతి లోపు రైతులు పండించిన ఆఖరు గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. లేకుంటే రైతులకు అండగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం. - నాదెండ్ల మనోహర్, జనసేన నేత

ఇవీచదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.