తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పనిచేస్తున్న హోంగార్డు నరేశ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నరేశ్‌కు వివాహం జరిగి ఇద్దరు పిల్లలున్నారు. కొంతకాలం నుంచి మరో మహిళతో.. అతను చనువుగా ఉంటున్నాడని తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. రెండు రోజులుగా.. నరేశ్ ఇంటికి రాకపోవటం వల్ల వారి అనుమానం బలపడింది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు... కూమారుడు ఉన్న ఇంటి వద్దకు వెళ్లారు.
ఇంటికి రాకుండా చూస్తోందని..
ఇంట్లో ఉన్న మహిళను ఆరా తీశారు. తన కుమారుని దగ్గర డబ్బులు తీసుకుంటోందని... ఇంటికి రాకుండా చూస్తోందని మహిళపై దాడి చేశారు. దుర్బాషలాడుతూ.. మహిళ చేతిలోని బ్యాగు లాక్కునే ప్రయత్నం చేశారు. అనంతరం మహిళ చేతులను కట్టేసి నానా రభస చేశారు.
దాడి చేసి బంధించారు..
తన వద్ద నుంచే నరేశ్... పలువురికి అప్పులు ఇప్పించాడని సదరు మహిళా ఆరోపించింది. వాటిని అడిగినందుకు హోంగార్డు తల్లిదండ్రులు ఒంటరిగా ఉన్న తనపై దాడి చేసి బంధించారని వాపోయింది.
రాజీకి మార్గాలు..
తమ కుమారుడు తప్పు చేస్తున్నాడని భావించిన హోం గార్డు తల్లిదండ్రులు... నరేశ్‌ను ఏమీ అనకపోగా సదరు మహిళపై మాత్రం దాడి చేయటం గమనార్హం. ఈ విషయం బయటికి పొక్కటం వల్ల రాజీ యత్నాలు కొనసాగుతున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: