రాజధాని రైతుల వార్షిక కౌలు చెల్లిపు అంశంపై మందడం రైతు ఆలూరి యుగంధర్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. వార్షిక కౌలు రైతుల హక్కని , ప్రతీ ఏడాది కౌలు చెల్లింపులో ఆలస్యమెందుకవుతోందని ప్రభుత్వాన్ని.. ధర్మాసనం ప్రశ్నించింది . కౌలుకు సంబంధించిన జీవో జారీచేశామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు . ఖాతాల్లో నగదు ఎప్పుడు జమ చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించగా న్యాయవాది నాలుగు వారాల సమయం కోరారు . మూడు వారాల్లోగా రైతుల ఖాతాలో కౌలు నగదు జమ చేయాలని హైకోర్టు.. ప్రభుత్వాన్ని ఆదేశించింది .
ఇదీ చదవండి:Yanamala: 2.3 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే 10 వేలే భర్తీ చేస్తారా?: యనమల