ETV Bharat / city

చినుకు తడిపే వేళ.. భద్రమిలా..!

author img

By

Published : Jul 9, 2022, 10:47 AM IST

Health Tips in Monsoon : బయట చినుకులు పడుతూ ఉంటే.. ఇంట్లో ఓ కప్పు వేడివేడి చాయ్‌ తాగుతూ ఏ పకోడీనో ఆస్వాదించమంటే.. ఇష్టపడని వాళ్లుండరు! ఈ వర్షాకాలంలో ఆనందాలతోపాటు కొన్ని చికాకులూ ఉంటాయి. అందుకే ఈ కాలంలో ఫ్యాషన్‌, అలంకరణ, ఆరోగ్యం విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి...

చినుకు తడిపే వేళ
చినుకు తడిపే వేళ

Health Tips in Monsoon : వర్షాకాలం ఎంత హాయినిస్తుందో.. అప్పుడప్పుడు అంతే చికాకు కలిగిస్తుంది. వాన నీటిలో తడుస్తూ ఎంజాయ్ చేద్దామనుకుంటారు. కానీ వర్షంలో తడిసిన తర్వాత జలుబు, జ్వరంతో బాధపడుతుంటారు. అంతే కాదు వాన నీటిలో తడవడం వల్ల చర్మం, జుట్టు సమస్యలు కూడా వస్తుంటాయి. వానలో బయటకు వెళ్లాల్సి వచ్చినా.. బయటకు వెళ్లినప్పుడు వర్షం కురిసినా.. మనం తడవడమే కాకుండా మన బ్యాగులు, షూస్ కూడా తడుస్తుంటాయి. ఇలా వానా కాలంలో వచ్చే ఇబ్బందులకు కొన్ని చిట్కాలు తెలుసుకుంటే.. వర్షాకాలంలోనూ హాయిగా ఆహ్లాదంగా గడపొచ్చు.

పాదాలు భద్రం: వర్షపునీటిలో నానిన పాదాల్ని అశ్రద్ధ చేస్తున్నారా? అయితే... ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు దాడి చేయడం పక్కా. వాటిని నిర్లక్ష్యం చేస్తే, పాదాలు పగిలి బాధిస్తాయి. తామర వంటి సమస్యలూ తలెత్తుతాయి. ఇందుకు పరిష్కారంగా... ఈ కాలంలో పూర్తిగా మూసి ఉంచే షూస్‌ని ధరించవద్దు. లోపలుండే తేమ వేళ్ల సందుల్లో ఇన్ఫెక్షన్లు వృద్ధి చెందడానికి కారణమవుతుంది. అందుకే గాలి తగిలే పాదరక్షల్నే ధరించాలి. గోరువెచ్చని నీళ్లలో యాంటీసెప్టిక్‌ లిక్విడ్‌ని వేసి అందులో పాదాలని ఉంచితే మంచిది. నిద్రపోయే ముందు యాంటీ ఫంగల్‌ టాల్కమ్‌ పౌడర్‌ని పాదాల మీద చల్లుకుంటే పగుళ్లు రాకుండా ఉంటాయి. అలాగే అరికాళ్లకు గోరింటాకుని ప్యాక్‌లా వేసినా ఇన్‌ఫెక్షన్ల సమస్య ఉండదు. మార్కెట్లో అలొవెరా సుగుణాలతో వాటర్‌ప్రూఫ్‌, జెల్లీ సాక్సులు దొరుకుతున్నాయి. వాటిని వాడి చూడండి.

స్కార్ఫ్‌ ధరించండి: ఈ కాలంలో స్కార్ఫ్‌ని మించిన ఫ్యాషన్‌ మరొకటి లేదు. చూడ్డానికి అందంగా ఉండటంతోపాటు జుట్టుని కాలుష్యం, ఆమ్లత్వం నిండిన నీటి నుంచీ కాపాడుతుంది. శరీరాన్ని చల్లగాలుల నుంచి రక్షిస్తుంది. ఫ్లోరల్‌ ప్రింట్లు ఉన్న దుస్తులపైకి ఈ స్కార్ఫ్‌లు బాగుంటాయి. అలాగే డెనిమ్‌ దుస్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అవి బిగుతుగా ఉండి త్వరగా ఆరవు. దాంతో శరీరంపై చెమ్మ నిల్వ ఉండిపోయి ఇన్‌ఫెక్షన్లు దాడిచేస్తాయి. బదులుగా త్వరగా ఆరే కాటన్‌ దుస్తులని ఎంచుకోవాలి. పలాజోలు, మంచివి. షార్ట్‌ లెగ్గిన్స్‌ అయితే ఇంకా సౌకర్యం.

అలంకరణలో మార్పులు చేయాల్సిందే: మబ్బుగానే ఉంటోంది.. ఎండ లేదని నిర్లక్ష్యం చేయకుండా సన్‌స్క్రీన్‌ని తప్పని సరిగా రాసుకోవాలి. అతిగా మేకప్‌ వేసుకోవడం అస్సలు తగదు. ఆ మేకప్‌ చర్మరంధ్రాలని మూసివేసి యాక్నె వంటివి రావడానికి కారణం అవుతుంది. అలాగే వారానికి రెండుసార్లన్నా మృతకణాలని తొలగించుకోవాలి. లిప్‌స్టిక్‌కి బదులుగా టిన్టెడ్‌ లిప్‌బామ్‌ని వాడితే అందంగా కనిపిస్తారు. ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఆల్కహాల్‌రహిత టోనర్‌ని రాయడం మర్చిపోవద్దు. ఇది తెరిచి ఉన్న చర్మరంధ్రాలని మూసివేసి ముఖంలో తాజాదనాన్ని నింపుతుంది. వయసుని కనిపించకుండా చేస్తుంది. వారానికి రెండు సార్లన్నా క్లే మాస్క్‌ని వేయాలి. ఈ మాస్క్‌ అధికంగా ఉన్న జిడ్డుని పీల్చుకుంటుంది. అలొవెరా, గ్రీన్‌టీ, ముల్తానీమట్టి వంటి మాస్క్‌లూ మేలు చేస్తాయి.

జుట్టుని పట్టించుకోండి: వానలో తడిస్తే జలుబు, జ్వరం వంటివి మాత్రమే వస్తాయనుకుంటే పొరపాటు. అంతకంటే ఎక్కువగా జుట్టు పాడవుతుంది. కారణం వర్షం నీటికి ఆమ్ల గుణం ఉంటుంది. అందుకే వర్షంలో తడిస్తే ఇంటికొచ్చి జుట్టుని ఆరబెట్టడం కాకుండా తలస్నానం చేయాలి. ఈ కాలంలో మామూలు షాంపూ బదులుగా యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ షాంపూలని వాడాలి. ఇవి జుట్టు మొదళ్లలో ఉండే బ్యాక్టీరియాని తొలగించి ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ఎక్కువ హెయిర్‌స్టైల్స్‌ చేయడం, బిగుతుగా ముడిపెట్టుకోవడం వంటివన్నీ మీ శిరోజాల ఇబ్బందుల్ని రెట్టింపు చేస్తాయి. వదులుగా తడి ఆరిపోయేలా ఉండాలి. అలాగే ఆహారంలో ఆకుకూరలు, వాల్‌నట్స్‌, తగినన్ని నీళ్లు ఉండేట్టు చూసుకుంటే శరీరానికి తగినంత తేమ అంది జుట్టు మెరుస్తూ ఉంటుంది. వేప, నిమ్మ, అలొవెరా వంటి వాటితో చేసిన ప్యాక్‌లు ఈ కాలానికి మంచివి.

ఇలా దాచేయండి: లెదర్‌ షూస్‌, బ్యాగులు వర్షం నీటికి పాడవుతాయనుకుంటే బయటకు వెళ్లేటప్పుడు వాటిపై వాటర్‌ ప్రూఫ్‌ స్ప్రేలు చల్లితే సరిపోతుంది. ఇవి లెదర్‌ని సంరక్షిస్తాయి. అలాగే... బ్యాగులు పాడవ్వకుండా ఉండేందుకు రెయిన్‌ కోట్‌ బ్యాగులు వస్తున్నాయి. ఇవి బ్యాగులకు తొడిగేస్తే ఫోన్‌, కార్డ్స్‌ వంటి విలువైన వాటికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అలాగే మార్కెట్లో దొరుకుతున్న ట్రెండీ రెయిన్‌ కోట్‌లు మీ అందాన్ని పెంచడంతోపాటు ఆరోగ్యాన్నీ కాపాడతాయి. పనిలోపనిగా మొబైల్‌ కవర్‌ ఒకటి కొనేసేయండి.

ఇదీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.