ETV Bharat / city

ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకంపై హైకోర్టులో విచారణ.. జులై 8కి వాయిదా

author img

By

Published : Jun 30, 2021, 7:23 AM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా విశ్రాంత ఐఏఎస్ అధికారి నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రతివాదులు దాఖలు చేసిన కౌంటర్లకు తిరుగు సమాధానంగా రిప్లై కౌంటర్ వేసేందుకు స్వల్ప సమయం కావాలన్నారు. అందుకు అంగీకరించిన హైకోర్టు విచారణను జూలై 8 కి వాయిదా వేశారు.

hc-on-sec
hc-on-sec

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది. ఏపీ ముఖ్యమంత్రి సలహాదారుగా పనిచేసిన నీలం సాహ్నిని అదే రాష్ట్రంలో ఎస్ఈసీగా నియమించడం నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. నీలం సాహ్నిపై రాజకీయ పార్టీ ప్రభావం ఉంటుందని పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.

అయితే, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నియామకం జరిగిందని పిటిషనర్ కోర్టుకి వివరించారు. ఈ వాదనలకు సంబంధించి ఎస్ఈసీ నీలం సాహ్ని కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు.. వచ్చే నెల 2లోపు రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్‌కి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 8కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

DISHA APP: 'దిశ' యాప్ ఉంటే..అన్నయ్య తోడున్నట్లే: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.