ETV Bharat / city

దేవాదాయ శాఖ జేఆర్​సీ నియామక నిలుపుదలకు హైకోర్టు నిరాకరణ

author img

By

Published : Jul 18, 2021, 7:25 AM IST

దేవాదాయ శాఖ జేఆర్సీ( రీజనల్ జాయింట్ కమిషనర్) గా ఎంవీ సురేష్​బాబు నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలును నిలుపుదల చేయడానికి హైకోర్టు నిరాకరించింది. పోతిన వెంకటమహేష్ వేసిన అనుబంధ పిటిషన్​ను కొట్టేసింది.

hc on rjc
hc on rjc

దేవదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్‌గా ఎంవీ సురేష్ బాబును నియమిస్తూ ఈ ఏడాది మే 17 న ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలును నిలుపుదల చేయడానికి హైకోర్టు నిరాకరించింది. సురేష్ బాబు విషయంలో ప్రభుత్వ ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయాలని కోరుతూ పోతిన వెంకటమహేష్ వేసిన అనుబంధ పిటిషన్ను కొట్టేసింది. ప్రధాన వ్యాజ్యంలో కౌంటర్ వేయాలని... ప్రతివాదులను ఆదేశించింది. విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఈ మేరకు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. విజయవాడ దుర్గ గుడిలో ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపిన అనిశా ... దేవస్థానం అప్పటి ఈవోగా ఉన్న సురేష్ బాబుపై నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయన్ని బదిలీ చేసి ఆర్జేసీగా నియమించింది. సురేష్ బాబు పై ఆరోపణల రీత్యా ఆయన్ని ఆర్జేసీగా నియమిస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, నియామక ఉత్తర్వులను రద్దు చేయాలని... పోతిన వెంకటమహేష్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి ప్రాథమిక ఆధారాలను పరిగణనలోకి తీసుకుంటే .. మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరే అర్హత పిటిషనర్ కు లేదన్నారు.

ఇదీ చదవండి: cbn on gazette: 'జలశక్తి నోటిఫికేషన్ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.