ప్రభుత్వ ఉత్తర్వు లను వెబ్సైట్లో ఉంచకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్ పై హైకోర్టు స్పందించింది . ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది . విచారణను సెప్టెంబర్ 8 కి వాయిదా వేసింది . హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది . జీవోలను వెబ్ సైట్లో ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడం సమాచార హక్కు చట్టం నిబంధనలకు విరుద్ధమని , తక్షణం జీవోలను అప్ లోడ్ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ జీఎంఎస్ఎస్ దేవి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు . న్యాయవాది వివిఎస్ఎస్ శ్రీకాంత్ వాదనలు వినిపిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి రాజకీయ రేవు ముత్యాలరాజు ఆగస్టు 15 న ప్రాసీడింగ్స్ జారీచేస్తూ జీవోలను అధికారిక వెబ్ సైట్లో అప్లోడ్ చేయవద్దంటూ అన్ని శాఖలను ఆదేశించారన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న రోజు వారి కార్యకలాపాలను తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్నారు. జీవోలను అందుబాటులో లేకుండా చేయడం ప్రజలు హక్కులను హరించడమేనన్నారు. తెలంగాణ హైకోర్టు ఇటీవల తీర్పు ఇస్తూ .. వెబ్ సైట్లో జీవోలను ఉంచాలని అక్కడి ప్రభుత్వాన్ని ఆదేశించిందన్నారు . ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న దర్మాసనం .. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సి.సుమన్ నుంచి వివరణ కోరింది . ఎస్జీసీ బదులిస్తూ పూర్తి వివరాలు సమర్పించేందుకు స్వల్ప సమయం కావాలన్నారు. దీంతో వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న జీఏడీ ముఖ్యకార్యదర్శి , తదితరులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది . కౌంటర్ వేయాలని ఆదేశించింది . ప్రభుత్వ స్పందన తెలిపాక తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది .
ఇదీ చదవండి: CJI N.V.RAMANA : జస్టిస్ ఎన్.వి.రమణకు తితిదే, శ్రీశైలం వేదపండితుల ఆశీర్వచనాలు
జీవోలను ఆన్‌లైన్‌లో ఉంచకపోవడంపై వ్యాజ్యం - ఏపీ వార్తలు
ప్రభుత్వ జీవోలను ఆన్‌లైన్‌లో ఉంచకపోవడంపై వ్యాజ్యం దాఖలైంది. స్పందించిన హైకోర్టు .. వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.