ETV Bharat / city

అమరావతికి రూ.496కోట్లు ఇచ్చాం: కేంద్రమంత్రి

author img

By

Published : Nov 27, 2019, 8:05 PM IST

స్మార్ట్ సిటీస్ మిషన్‌ కింద అమరావతికి రూ.496 కోట్లు ఇచ్చినట్లు తెలిపిన కేంద్రం తెలిపింది. ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి హర్దీప్​సింగ్ లిఖితపూర్వక జవాబునిచ్చారు. విశాఖ, తిరుపతి, కాకినాడకు విడుదల చేసిన నిధులు లెక్కలూ వివరించారు.

has-been-given-rs-496-crore-under-the-smart-cities-mission-to-amaravthi-says-by-union-minister

స్మార్ట్ సిటీస్ మిషన్‌ కింద అమరావతికి రూ.496 కోట్లు ఇచ్చినట్లు తెలిపిన కేంద్రం తెలిపింది. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి హర్దీప్​సింగ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2017-18 నుంచి ఇప్పటివరకు అమరావతికి రూ.496 కోట్లు విడుదల చేశామని తెలిపారు. అమరావతికి రూ.472 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. స్మార్ట్‌ సిటీస్‌ కింద ఎంపికైన విశాఖ, తిరుపతి, కాకినాడకూ నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. 2015-16 నుంచి ఇప్పటివరకు విశాఖకు రూ.299 కోట్లు, తిరుపతికి రూ.196 కోట్లు, కాకినాడకు రూ.392 కోట్లు విడుదల చేశామని ప్రకటించారు. స్మార్ట్ సిటీస్ మిషన్‌ను హడావిడిగా అమలుచేయడం తమ లక్ష్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. ఈ మిషన్ కింద చేపట్టే ప్రాజెక్టుల నాణ్యత అత్యుత్తమంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ఇదీ చదవండి : రేపు రాజధానిలో చంద్రబాబు పర్యటన... నేతలతో సమాలోచనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.