ETV Bharat / city

వైద్య కళాశాలల నిర్మాణానికి రూ.2,050 కోట్లతో పాలనానుమతులు - ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయాలు

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో వైద్య కళాశాలల నిర్మాణం జరగనుంది. వైద్య కళాశాలల నిర్మాణానికి రూ.2,050 కోట్లతో పాలనానుమతులు వచ్చాయి. వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

Six more new Medical colleges in Andhra Pradesh
వైద్య కళాశాలల నిర్మాణానికి రూ.2,050 కోట్లతో పాలనానుమతులు
author img

By

Published : Sep 12, 2020, 3:58 PM IST

రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల నిర్మాణానికి రూ.2,050 కోట్లతో పాలనానుమతులు వచ్చాయి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో వైద్య కళాశాలల నిర్మాణం జరగనుంది. వైద్య కళాశాలల నిర్మాణానికి గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విశాఖ జిల్లా పాడేరులో వైద్య కళాశాల ఏర్పాటుకు రూ.500 కోట్లు కేటాయించారు. కడప జిల్లా పులివెందులలో వైద్య కళాశాల ఏర్పాటుకు రూ.500 కోట్లు, గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో వైద్య కళాశాలకు రూ.500 కోట్లు మంజూరయ్యయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైద్య కళాశాలకు రూ.550 కోట్లు కేటాయించింది ప్రభుత్వం.

పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల కళాశాలల్లో ఒక్కోచోట 100 ఎంబీబీఎస్ సీట్లు ఉండనున్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 150 ఎంబీబీఎస్ సీట్లు ఉండనున్నాయి. ఆరుచోట్ల కళాశాలలకు రూ.104.17 కోట్లతో స్థలాల కొనుగోలుకు అనుమతులు మంజూరు అయ్యాయి. అమలాపురం, ఏలూరు, పిడుగురాళ్లలో స్థలాల కొనుగోలుకు అనుమతులు వచ్చాయి. మదనపల్లి, ఆదోని, పులివెందులలో స్థలాల కొనుగోలుకు అనుమతులు ఇస్తూ... వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చదవండీ... నిధుల వేటలో ప్రభుత్వం... గ్యాస్​పై 10 శాతం వ్యాట్ పెంపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.