డిసెంబరు 10న గొర్రెలు, మేకలు పంపిణీ చేయాలని ప్రభుత్వ నిర్ణయించింది. వైఎస్‌ఆర్ చేయూత, ఆసరా లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఉత్తర్వులు వెలువడ్డాయి. 2.49 లక్షల యూనిట్ల పంపిణీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంపిణీకి చర్యలు తీసుకోవాలని పశుసంవర్థకశాఖ డైరెక్టర్‌ను ఆదేశించింది.
అనంతపురం జిల్లా పెనుకొండలో షెపర్డ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. రూ.2.5 కోట్లతో గొర్రెల కాపరుల శిక్షణా కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుత గొర్రెల పెంపకం కేంద్రంలోనే శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. గొర్రెల పెంపకంపై శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణ ఇచ్చేందుకు కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పశుసంవర్థకశాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
ఇదీ చదవండీ... ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. మారమ్మకు ఇల్లు కట్టిస్తామని హామీ