ETV Bharat / city

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త - DA for ap employees news

కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలను ఈ ఏడాది నవంబరు నెల వేతనంతో కలిపి ప్రభుత్వం చెల్లించనుంది. మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన జీతాలను ఐదు విడతలుగా చెల్లించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు 2018 జులై నుంచి 2019 డిసెంబరు వరకూ పెండింగ్​లో ఉన్న మూడు డీఏలను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకారాన్ని తెలిపింది. మొదటి విడత డీఏను 2021 జనవరి నెల వేతనంతో చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. డీఏ బకాయిలను విడతలవారీగా చెల్లించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
author img

By

Published : Oct 24, 2020, 8:56 PM IST

కరోనా కారణంగా వాయిదా పడిన ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలను ఈ ఏడాది నవంబరు నెల వేతనంతో ప్రభుత్వం చెల్లించనుంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మొదటి విడత వాయిదా వేతనాన్ని డిసెంబరు ఒకటో తేదీన ఉద్యోగులు అందుకోనున్నారు. విడతల వారీగా ఉద్యోగుల బకాయి వేతనాలను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకారాన్ని తెలిపినట్టు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షడు కె.వెంకట్రామిరెడ్డి తెలిపారు. నవంబరు నెల నుంచే వాయిదా జీతాల చెల్లింపు ఉంటుందని ఉద్యోగుల ఫెడరేషన్ స్పష్టం చేసింది.

కరోనా కారణంగా వాయిదా వేసిన మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి.. సగం జీతాలను ఐదు విడతల్లో చెల్లించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. మొదటి విడత ఈ ఏడాది నవంబరు నెల జీతంతో నగదుగా చెల్లించనున్నారు. మరోవైపు 2018 జులై నుంచి 2019 వరకూ పెండింగ్​లో ఉన్న మూడు డీఏల చెల్లింపునకూ రాష్ట్ర ప్రభుత్వం అంగీకారాన్ని తెలిపింది. 2020 నుంచి రావాల్సిన డీఏను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. పెండింగ్​లో ఉన్న డీఏలలో మొదటి విడతగా 2021 జనవరి నుంచి ఇక రెండో డీఏను 2021 జులై నుంచి అలాగే మూడో విడత డీఏను 2022 జనవరి నుంచి చెల్లించనున్నట్టు ప్రభుత్వం తెలియచేసింది.

2015లో చేసిన పెంపు మేరకు ఉద్యోగులకు 30.392 శాతం మేర డీఏను చెల్లించనున్నారు. పెరిగిన డీఏ ప్రకారం మొదటి విడతపై నెలకు అదనంగా 86.41 కోట్లు ఏడాదికి 1037 కోట్ల మేర భారం పడనుంది. ఇక 2021న చెల్లించాల్సిన రెండో డీఏ బకాయిపై నెలకు 172 కోట్ల రూపాయల మేర, అలాగే ఏడాదికి 2074 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. 2022 జనవరి1 నుంచి చెల్లించాల్సిన మూడో బకాయి డీఏ కోసం నెలకు 316 కోట్ల రూపాయలు, ఏడాదికి 3802 కోట్ల రూపాయల మేర అదనపు భారం పడుతుందని ప్రభుత్వం తెలిపింది.

మొదటి విడత డీఏ బకాయిలను 3 విడతలుగా, రెండో విడత డీఏ బకాయిలను 3 విడతలుగా, మూడో విడత డీఏ బకాయిలను 5 విడతలుగా ఉద్యోగులకు చెల్లించనున్నారు. మొత్తంగా డీఏ పెంపుతో 3802 కోట్ల రూపాయలు, డీఏ బకాయిలుగా 9504 కోట్ల రూపాయల మేర ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించనుంది. మొత్తం 4 లక్షల 49 వేల మంది ఉద్యోగులు, 3 లక్షల 57 వేల మంది పెన్షనర్లకు ఈ పెంచిన డీఏ మొత్తాలను చెల్లించనున్నారు.

ఇదీ చదవండీ... 'జగన్​.. సామాజిక న్యాయం సంరక్షకుడిగా మారారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.