నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వాసిలివద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆపి ఉన్న ఆటోను ఇన్నోవా కారు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా..మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఆత్మకూరు నుంచి కోలగుట్ల గ్రామం వెళ్తున్న ఆటోలో వ్యవసాయ కూలీలు సహా మొత్తం 11 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరు చిన్నారులున్నారు. ప్రయాణికులను దించేందుకు వాసిలి గ్రామం వద్ద ఆటోను ఆపి ఉండగా...వెనుక నుంచి ఆత్మకూరు నుంచి నెల్లూరు వెళ్తున్న ఇన్నోవా కారు బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్నవారు చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ ప్రమాదంలో గురునాథం చిన్నమ్మ(70), షేక్ మస్తాన్ బీ(60), కొండమ్మ(55), అల్లంపాటి కొండారెడ్డి(60) మృతి చెందారు. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి : ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు..మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు