ETV Bharat / city

రెడ్​జోన్​లో ఆ ఐదు జిల్లాలు...! - redzone news

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాలను కేంద్రం రెడ్​జోన్ జాబితాలోకి చేర్చింది. విజయనగరం జిల్లాను గ్రీన్ జోన్​లోనూ.... మిగతా ఏడు జిల్లాలను ‘ఆరెంజ్‌ జోన్‌’గా వర్గీకరించింది.

Five districts in the Red Zone from the state
రాష్ట్రం నుంచి రెడ్​జోన్​లో ఐదు జిల్లాలు
author img

By

Published : May 2, 2020, 7:30 AM IST

రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాలను కేంద్రం ‘రెడ్‌ జోన్‌’ జిల్లాలుగా ప్రకటించింది. విజయనగరం మినహా మిగతా ఏడు జిల్లాలను ‘ఆరెంజ్‌ జోన్‌’గా వర్గీకరించింది. ఇంతవరకు ఒక్క కేసూ రాని విజయనగరం జిల్లాను ‘గ్రీన్‌ జోన్‌’లో చేర్చింది. ఈ వర్గీకరణ మే 3 నుంచి వారంపాటు ఉంటుందని.. ఆయా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసులు, ఇతర అంశాల్ని దృష్టిలో ఉంచుకుని ప్రతివారం ఈ జాబితా మారుతుందని కేంద్రం పేర్కొంది. ఇంతవరకు ఒక్క కేసూ లేకపోయినా, గడిచిన 21 రోజుల్లో కొత్త కేసులేవీ రాకపోయినా.. ఆ జిల్లాలను గ్రీన్‌జోన్‌లో చేర్చారు. కాగా, రాష్ట్రంలో గతంలో 11 రెడ్‌జోన్‌ జిల్లాలుండగా అవి 5కి తగ్గాయి. 6 రెడ్‌జోన్‌, ఒక గ్రీన్‌జోన్‌ జిల్లాలు ఆరంజ్‌లోకి మారాయి. గ్రీన్‌జోన్‌లో ఇంతకుముందు రెండు జిల్లాలుండగా ఇప్పుడు ఒకటే ఉంది. రాష్ట్రంలో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలోని జిల్లాలు, అక్కడ కేసులు నమోదైన తీరు ఇలా ఉంది.

ఆ మూడు జిల్లాలు హాట్‌స్పాట్లు

కేంద్రం రెడ్‌ జోన్‌గా ప్రకటించిన ఐదు జిల్లాల్లో.. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలు కరోనా కేసులకు హాట్‌స్పాట్లుగా మారాయి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పెద్దసంఖ్యలో కేసులు రావడంతోనే ఆ జిల్లా రెడ్‌ జోన్‌లోకి వెళ్లింది. తొలికేసు నమోదైన నెల్లూరులో వ్యాప్తి కొంత నెమ్మదించింది. ఏప్రిల్‌ 11 నుంచి కరోనా కేసులు గుంటూరు జిల్లాలో ఇప్పటికి నాలుగు రెట్లు, కృష్ణా జిల్లాలో ఏడు రెట్లు, నెల్లూరులో రెట్టింపు అయ్యాయి. చిత్తూరులో నాలుగు రెట్లు, కర్నూలు జిల్లాలో ఐదు రెట్ల వంతున పెరిగాయి.

ఆరెంజ్‌ జోన్‌లో 50కి పైగా కేసులున్న జిల్లాలు నాలుగు

రాష్ట్రంలో ఆరెంజ్‌ జోన్లుగా ప్రకటించిన ఏడు జిల్లాల్లో.. కడప (79), అనంతపురం (67), ప్రకాశం (60), పశ్చిమగోదావరి (58) జిల్లాల్లో 50 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో ఆరెంజ్‌ జోన్‌లో నమోదైనవి 22.96% (336). ఆరెంజ్‌ జోన్‌లో అతి తక్కువ సంఖ్యలో కేసులున్నది శ్రీకాకుళం జిల్లాలోనే. అక్కడ 5 కేసులే (0.34%) ఉన్నాయి. శ్రీకాకుళం తర్వాత అతి తక్కువ కేసులు నమోదైంది విశాఖ జిల్లాలోనే. అక్కడ 25 (1.70%) కేసులు ఉన్నాయి.

ఆ పరిధిలో 72 మండలాలు

రాష్ట్రంలో మొత్తం 72 మండలాలు రెడ్‌జోన్ల పరిధిలో ఉన్నాయి. ఏప్రిల్‌ 29(బుధవారం) వరకూ నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల ఆధారంగా ప్రభుత్వం జోన్లుగా విభజించింది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 11 మండలాలు రెడ్‌జోన్‌ పరిధిలో ఉన్నాయి. కడప, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో 9 చొప్పున మండలాలున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం మండలం ఒక్కటే ఉంది. విజయనగరం జిల్లాలో ఇప్పటివరకూ కేసులు నమోదు కానందున అక్కడ రెడ్‌జోన్లు లేవు. అత్యధిక కేసులు నమోదైన మండలాల్లో విజయవాడ నగర పరిధిలో 201, కర్నూలు నగర పరిధిలో 196, గుంటూరు నగర పరిధిలో 137 చొప్పున ఉన్నాయి.

రెడ్​జోన్ల ప్రాంతాలు

  • కర్నూలు: కర్నూలు(నగరం), నంద్యాల(పట్టణం), పాణ్యం(గ్రామీణ), నందికొట్కూరు(పట్టణం), కోడుమూరు(గ్రామీణ), ఆత్మకూరు(పట్టణం), చాగలమర్రి(గ్రామీణ), బనగానపల్లె(గ్రామీణ), ఎమ్మిగనూరు(పట్టణం)
  • గుంటూరు: నరసరావుపేట(పట్టణం), గుంటూరు(పట్టణం), దాచేపల్లి(గ్రామీణ), మాచర్ల(పట్టణం), అచ్చంపేట(గ్రామీణ), కారంపూడి(గ్రామీణ), తాడేపల్లి(పట్టణం), పొన్నూరు(పట్టణం)
  • చిత్తూరు: శ్రీకాళహస్తి(పట్టణం), నిండ్ర(గ్రామీణ), నగరి(పట్టణం), పలమనేరు(పట్టణం), తిరుపతి(పట్టణం)
  • నెల్లూరు: నాయుడుపేట(పట్టణం), వాకాడు(గ్రామీణ), తడ(గ్రామీణ), నెల్లూరు(పట్టణం), కోవూరు(గ్రామీణ), ఆలూరు(గ్రామీణ), తోటపల్లి గూడూరు(గ్రామీణ), ఇందుకూరుపేట(గ్రామీణ), కొండాపురం(గ్రామీణ), ముత్తుకూరు(గ్రామీణ), బుచ్చిరెడ్డిపాళెం(గ్రామీణ)
  • కృష్ణా: విజయవాడ(నగరం), జగ్గయ్యపేట(పట్టణం), పెనమలూరు, నూజివీడు, విజయవాడ(గ్రామీణ), ముసునూరు(గ్రామీణ), మచిలీపట్నం(పట్టణం), కంకిపాడు(గ్రామీణ), గన్నవరం(గ్రామీణ)
  • పశ్చిమగోదావరి: పెనుగొండ(గ్రామీణ), ఏలూరు(పట్టణం), తాడేపల్లిగూడెం(పట్టణం), భీమవరం(పట్టణం)
  • కడప: బద్వేలు(పట్టణం), ఎర్రగుంట్ల(నగరం), ప్రొద్దుటూరు(పట్టణం), చెన్నూరు(గ్రామీణ), పులివెందుల(పట్టణం), మైదుకూరు, కడప(నగరం), చింతకొమ్మదిన్నె(గ్రామీణ), పుల్లంపేట(గ్రామీణ)
  • అనంతపురం: హిందూపురం(పట్టణం), అనంతపురం(పట్టణం), కళ్యాణదుర్గం(పట్టణం), గుంతకల్లు(పట్టణం)
  • ప్రకాశం: ఒంగోలు(పట్టణం), గుడ్లూరు(గ్రామీణ), కారంచేడు(గ్రామీణ), చీరాల(పట్టణం)
  • తూర్పుగోదావరి: శంఖవరం(గ్రామీణ), రాజమహేంద్రవరం(నగరం), పెద్దాపురం, సామర్లకోట, రాజమండ్రి(గ్రామీణ)
  • విశాఖపట్నం: పద్మనాభం(గ్రామీణ), నర్సీపట్నం(పట్టణం), విశాఖపట్నం(నగరం)
  • శ్రీకాకుళం: పాతపట్నం (గ్రామీణ)

ఇవీ చదవండి...గొంతు తడిసే దారేది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.