- ప్రధాని మోదీకి మరోసారి లేఖ రాసిన సీఎం జగన్
ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరుతూ.. సీఎం జగన్ లేఖ రాశారు.అఖిలపక్షంతో కలిసి మోదీని కలిసేందుకు అనుమతి కావాలని లేఖలో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'విశాఖ ఉక్కుపై పవన్ స్పందించాలి.. భాజపా నేతలు పోరాటానికి కలసి రావాలి'
విశాఖ ఉక్కుపై అందరం కలిసి పోరాడాలని.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఉక్కు ప్రైవేటీకరణకు రాష్ట్ర భాజపా నేతలు ప్రధాన పాత్ర పోషించాలని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విశాఖలో.. నిరసనకారులు, పోలీసుల మధ్య తోపులాట
విశాఖ ఉక్కు ఆందోళనలో ఉద్రిక్తత నెలకొంది. ఉక్కు పరిశ్రమ పరిపాలనా కార్యాలయం వద్ద కార్మికులు నిరసన చేపట్టారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు. డైరెక్టర్ ఫైనాన్స్ వేణుగోపాలరావు వాహనాన్ని కార్మికులు చుట్టుముట్టగా... పోలీసులు విడిపించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో.. నిరసనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నేటి నుంచి మహానందిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు
మహానందిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 14 వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శివరాత్రి రోజు స్వామివారి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండువగా జరపనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కర్ణాటకలో ఏసీబీ విస్తృత సోదాలు
ఏసీబీ అధికారులు కర్ణాటకలో విస్తృత సోదాలు చేపట్టారు. మంగళవారం ఒకేసారి తొమ్మిది మంది అధికారులకు చెందిన 28 ప్రాంతాల్లో సోదాలు జరిపారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయా అధికారుల ఇళ్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'లక్షల ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడిస్తాం'
రైతు చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్. మధ్యప్రదేశ్ షియోపుర్‌లో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన మాట్లాడారు. అవసరమైతే ఆ డిమాండ్ కోసం లక్షలాది ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం నడిపేది దేశాన్ని కాదని, కంపెనీ అని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'నిజాలు తెలుసుకోకుండా ఏకపక్ష డిబేట్ సరికాదు'
రైతు ఆందోళనల నేపథ్యంలో బ్రిటన్ పార్లమెంట్ నిర్వహించిన డిబేట్‌పై భారత్ మండిపడింది. నిజానిజాలు తెలుసుకోకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంపై నిందలు వేయడాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు లండన్‌లో భారత హైకమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విస్తరించనున్న చతురస్రం- చైనాను ఎదుర్కొనే వ్యూహమదే
ఫిబ్రవరిలో జరిగిన చతుర్భుజ కూటమి (క్వాడ్) దేశాల మంత్రుల స్థాయి మూడో సమావేశంలో భారత్‌తో వివిధ అంశాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని అమెరికా ప్రకటించింది. మరోవైపు.. బైడెన్ సర్కారు క్వాడ్‌ను మరింత విస్తరించే ప్రయత్నాలు చేస్తోంది. ఐరోపా మిత్రులను కూడా దీనిలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. చైనాను హిందూ మహాసముద్రంలో కట్టడి చేయడమే లక్ష్యంగా భారత్ క్వాడ్‌లో భాగస్వామిగా మారింది. ఇండో-పసిఫిక్‌పై ఐరోపా దేశాలూ ఆసక్తి చూపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గోవాలో బుమ్రా పెళ్లి.. కాబోయే భార్య ఎవరంటే?!
టీమ్ఇండియా పేసర్ బుమ్రా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడా? అంటే అవుననే సమాధానమిస్తున్నాయి క్రికెట్ వర్గాలు. ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంజనా గణేషన్‌ను.. బుమ్రా వివాహం చేసుకోనున్నాడని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మెగాహీరోతో 'ప్లే బ్యాక్' దర్శకుడి చిత్రం!
'ప్లేబ్యాక్' చిత్ర దర్శకుడు హరిప్రసాద్ మెగా హీరోతో ఓ సినిమా తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.