రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఈనెల 7వతేదీన చిత్తూరు జిల్లా మదనపల్లెలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
రాష్ట్రపతి 7వతేదీ మధ్యాహ్నం చిత్తూరు జిల్లా మదనపల్లెకు చేరుకుని సత్సంగ్ ఫౌండేషన్ ఆశ్రమాన్ని సందర్శించి.... అక్కడ యోగశాల, భారత్ యోగ విద్యాకేంద్రాన్నిప్రారంభించనున్నారని సీఎస్ తెలిపారు. అలాగే 38 పడకల స్వస్థ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని స్పష్టం చేశారు. తదుపరి సాడమ్ చేరుకుని అక్కడ పీపాల్ గ్రోవ్ పాఠశాలను సందర్శించి విద్యార్ధులతో ముచ్చటించనున్నారని పేర్కొన్నారు. రాష్ట్రపతి పర్యటనలో గవర్నర్ బిష్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు పాల్గొనున్నారని తెలిపారు.