ట్రాక్టర్ ఇసుకను రూ.1000కే ఇవ్వాలని కోరుతూ సీఎం జగన్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ రాశారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో ఇసుక కొరత సృష్టించారని అన్నారు. రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం కుదేలైందని.. దివాలా తీసిన కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించడం ఆశ్చర్యకరంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. క్విడ్ ప్రోకో జరిగిందన్న వార్తలకు సమాధానం చెప్పాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'సాక్షులుగా అనిశా, సీఐడీ అధికారులను పిలవాలి'