ETV Bharat / city

AP GOVERNOR: రాష్ట్ర గవర్నర్​ బిశ్వ భూషణ్​కు కరోనా నెగెటివ్ - covid negative to AP governor

రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్( GOVERNOR BISWABHUSAN HARICHANDAN )​కు ఆర్టీపీసీఆర్ పరీక్షలో కొవిడ్ నెగెటివ్(CORONA NEGATIVE TO GOVERNOR) నిర్ధారణ అయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కరోనాతో ఈనెల 17న హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన గవర్నర్.. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు వివరించారు.

corona-negative-to-ap-governor-biswabhusan-harichandan
రాష్ట్ర గవర్నర్​ బిశ్వ భూషణ్​కు కరోనా నెగెటివ్
author img

By

Published : Nov 21, 2021, 8:19 AM IST

హైదరాబాద్​లోని ఏజీఐ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్​(GOVERNOR BISWABHUSAN HARICHANDAN) కు ఆర్టీపీసీఆర్ పరీక్షలో కొవిడ్ నెగెటివ్ నిర్ధారణ అయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందని ఏఐజీ ఆసుపత్రికి చెందిన ఉన్నత స్థాయి వైద్యుల బృందం శనివారం సాయంత్రం విడుదల చేసిన నివేదికలో తెలిపారు.

ఈ నెల 17న దిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్​ (AP governor) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. ఆయన స్వల్ప దగ్గు, జలుబుతో బాధపడుతున్నందున ముందు జాగ్రత్త చర్యగా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించారు. స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో గవర్నర్‌ను హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: Minister Perni Nani: 'భువనేశ్వరి ప్రస్తావనే రాలేదు.. చంద్రబాబే డ్రామా సృష్టించారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.