రాష్ట్రంలో కొత్తగా 1,160 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 8,61,092కి చేరింది. తాజాగా మహమ్మారి కాటుకు మరో ఏడుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6,927కి చేరింది. వైరస్ నుంచి మరో 1,765 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో కోలుకున్నవారి సంఖ్య 8.39 లక్షలకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,770 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 68,307 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా...ఇప్పటివరకు కొవిడ్ పరీక్షల సంఖ్య 95.43 లక్షలకు చేరింది.
ఇదీ చదవండి