ETV Bharat / city

P.Chidambaram: మోదీ ఆ పని చేస్తే పెట్రోల్ ధర భారీగా తగ్గొచ్చు: చిదంబరం

author img

By

Published : Aug 19, 2021, 12:08 PM IST

పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం అన్నారు. మంచి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నా.. అమలులో విఫలం అయ్యారని తెలిపారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

చిదంబరం
చిదంబరం

ప్రతిపక్షంగా ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపడమే తమ ప్రధాన విధి అని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అన్నారు. సమస్యను గుర్తించి సమర్థంగా పరిష్కరించేలా విధానాలు రూపొందించాలని ప్రభుత్వాలకు సూచించారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా రుద్రారంలో ఉన్న గీతం యూనివర్సిటీలో.. కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విద్యార్థులను ఉద్దేశించి చిదంబరం ప్రసంగించారు.

ఈ సందర్భంగా కేంద్రం తీసుకున్న నోట్ల రద్ద నిర్ణయంపై అభిప్రాయం పంచుకున్నారు. పెద్దనోట్ల రద్దు వల్ల ప్రయోజనం కంటే.. నష్టమే ఎక్కువగా జరిగిందని అన్నారు. మంచి ఉద్దేశంతో తీసుకువచ్చినా అమలు మాత్రం అత్యంత అధ్వానంగా జరిగిందని చెప్పారు. ధనవంతులు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని మార్చుకున్నారని, అతి తక్కువ సంఖ్యలో బ్యాంకులు ఉన్న బిహార్, ఈశాన్య రాష్ట్రాల వంటి ప్రాంతాల్లో పేదలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు.

"అత్యవసర నిధులు, ప్రత్యేక పథకాల కోసం పెట్రోల్​పై సెస్ విధిస్తోంది. ఇది కొంత కాలం మాత్రమే ఉండాలి. కానీ, ప్రస్తుత ప్రభుత్వం దీన్నో అవకాశంగా మార్చుకుంది. సెస్​ల ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా ఉండదు. ప్రస్తుతం పెట్రోల్ మీద ఉన్న సెస్ తొలగిస్తే పెట్రోలు ధరను రూ.32 వరకు తగ్గించవచ్చు. టాడా, ఉల్ఫా వంటి చట్టాలు కొన్ని ప్రత్యేక అవసరాల కోసం కాలపరిమితితో తీసుకువస్తారు. అవసరాలు తీరిన తర్వాత ఆ చట్టాలను ఉపసంహరించుకోవాలి. వాస్తవ పరిస్థితుల్లో మాత్రం ఇలా జరగడం లేదు. ఇటువంటి చట్టాల్లో కేవలం 2 శాతమే శిక్షలు పడుతున్నాయి. రాజకీయ ప్రతీకారాలు తీర్చుకోవడానికే ఈ చట్టాలు ఉపయోగిస్తున్నారు." - చిదంబరం, కేంద్ర మాజీ మంత్రి

బాలాకోట్ దాడులు సరైన సమయంలో అభినందించేలా జరిగాయని చిదంబరం అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా.. తాము ఆ దాడులకు మద్దతు ఇచ్చినట్లు గుర్తు చేశారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. మంత్రిగా, నాయకుడిగా.. తన స్వీయ అనుభవాలను వారితో పంచుకున్నారు.

ఇదీ చదవండి:

Kishan reddy: 'కేంద్ర పథకాల అమలు మినహా.. రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.