ETV Bharat / city

జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం.. ఇసుక రవాణా ఛార్జీలపై కీలక నిర్ణయం! - ఏపీ తాజా వార్తలు

జగనన్న కాలనీల్లో చేపట్టనున్న ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను తరలించడానికయ్యే రవాణా ఛార్జీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. రీచ్‌ల నుంచి 40 కి.మీ దాటి ఎంత దూరం ఉన్నా టన్నుకు రూ.175 చొప్పున 20 టన్నులకు రూ.3,500లను మాత్రమే లబ్ధిదారుల నుంచి వసూలు చేయనుంది.

sand
sand
author img

By

Published : Jun 30, 2021, 10:59 AM IST

అదనపు రవాణా ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించనుంది. ఈ రూ.3,500లను కూడా ఇంటి రాయితీ కింద అందించే రూ.1.80 లక్షల నుంచి మినహాయిస్తుంది. లబ్ధిదారులు చేతి నుంచి చెల్లించాల్సిన అవసరం లేదు. విశాఖపట్నం, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో ఉన్న లేఅవుట్ల నుంచి ప్రభుత్వం కేటాయించిన ఇసుక రీచ్‌లు 100 కి.మీపైగా దూరంలో ఉన్నాయి. దాంతో లబ్ధిదారులపై రవాణా ఛార్జీల భారం పడకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 20 టన్నుల ఇసుక ఉచితంగా అందిస్తుంది. 10 టన్నుల చొప్పున పునాది దశలో, స్లాబు దశలో రెండు విడతలుగా ఇసుకను ఇస్తోంది. సరఫరాకు సంబంధించి కూపన్లు ఇస్తారు. రీచ్‌ల ఎంపికలో మూడు ఆప్షన్లు ఇస్తారు. రవాణా ఛార్జీని లబ్ధిదారులే భరించాలి. ఇసుక రవాణాకు టన్నుకు కిలోమీటర్‌కు రూ.5 చొప్పున వసూలు చేస్తారు. 40 కి.మీల కంటే తక్కువ దూరం ఉంటే లబ్ధిదారులే రీచ్‌ల నుంచి ఇసుక తీసుకెళ్లవచ్చు.

ఉదాహరణకు జగనన్న లేఅవుట్‌ నుంచి ఇసుక రీచ్‌ 20 కిలోమీటర్ల దూరంలో ఉంటే రవాణా ఛార్జీ కింద 20 టన్నులకు రూ.2 వేలు అవుతుంది. అదే 40 కి.మీకి మించి ఉంటే ఎక్కువ అవుతుంది. అటువంటి లబ్దిదారులకు రూ.3,500 చెల్లింపు వెసులుబాటును వర్తింపచేస్తారు. జేపీ పవర్‌ వెంచర్స్‌ సంస్థ సమకూర్చిన వాహనాల్లో ఇసుక తీసుకెళ్లిన లబ్ధిదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అదనంగా అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం ఆ సంస్థకు చెల్లిస్తుంది. ప్రైవేటు, సొంత వాహనాల్లో తీసుకెళ్లే వారికి ఇది వర్తించదని గృహనిర్మాణశాఖ అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

RRR: 'ఆర్​ఆర్​ఆర్'​ పోస్టర్​.. సైబరాబాద్​ పోలీసుల ట్రోల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.