ETV Bharat / city

'అమృత్ పథకం పనులపై సమగ్ర అధ్యయనానికి ఆదేశం' - comprehensive study on Amrut project

అమృత్ పథకంలో భాగంగా జరిగిన పనులపై సమగ్ర అధ్యయనానికి ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అర్భన్ ఫైనాన్స్ అండ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ ఎండీని ఆదేశించారు.

అమృత్ పథకం పనులపై సమగ్ర అధ్యయనానికి ఆదేశం
author img

By

Published : Sep 7, 2019, 1:38 AM IST

రాష్ట్రంలో అమృత్ పథకంలో భాగంగా జరిగిన పనులపై సమగ్ర అధ్యయనానికి ప్రభుత్వం ఆదేశించింది. 25 శాతం కంటే తక్కువ జరిగిన పనులపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపి... సమగ్ర నివేదికలు అందచేయాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అర్భన్ ఫైనాన్స్ అండ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీని ఆదేశించారు.

ఇప్పటికే పూర్తయిన పనుల నాణ్యతపై తనిఖీలు చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల, సెప్టేజీ నిర్వహణతో పాటు పార్కుల నిర్మాణం వంటి పనులను కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో చేపట్టారు. 25శాతం కంటే తక్కువ, అసలే ప్రారంభం కాకుండా 35శాతం పనులకు సంబంధించిన వాటిని స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి... మున్సిపల్ కమిషనర్లు తనిఖీ చేయాలని నిర్దేశించారు.

టెండర్ల ప్రక్రియను అధ్యయనం చేసి... అధిక ధరలకు టెండర్లు ఖరారు చేసినవాటిని గుర్తించాలని సూచించారు. ప్రజా ధనాన్ని ఆదా చేసేందుకు వీలుగా... రివర్స్ టెండరింగ్ వెళ్లే అవకాశాలపై ఉన్నతాధికారుల కమిటీ అధ్యయనం చేయాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ...వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల విభజన పూర్తి

Intro:అనంతపురం జిల్లా ధర్మవరంలో గణేష్ నిమజ్జనం కన్నుల పండువగా జరిగింది పట్టణంలో 40 వార్డులలో ఏర్పాటుచేసిన వినాయకులను మూడవరోజు నిమజ్జనానికి తరలించారు ప్రధాన రహదారిపై ఊరేగింపుగా నిమజ్జనానికి తీసుకెళ్లారు యువకులు మహిళలు చిన్నారులు ఉత్సాహంగా ఊరేగింపులో పాల్గొన్నారు ధర్మవరం పట్టణ శివార్లలోని చెరువు నీటిలో గణనాథులను నిమజ్జనం చేశారు గణపతి బొప్పా మోరియా నినాదాలతో చెరువు ప్రాంతం హోరెత్తింది 200 గణనాథుల విగ్రహాలను నిమజ్జనం చేశారు చెరువు వద్ద పట్టణ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు

Body:గణేష్ నిమజ్జనం

Conclusion:అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.