అవినీతిపై పోరాటంలో ఏమాత్రం వెనకడుగు వేయొద్దని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఒత్తిళ్లను ఖాతరు చేయొద్దని సూచించారు. తనపైనా ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయని వాటికి లొంగే ప్రసక్తే లేదన్నారు. ప్రజాధనానికి మనం కాపలాదారులుగా ఉండాలని మంత్రులతో అన్నారు. తాడేపల్లిలోని ఆయన నివాసంలో మంత్రివర్గ ఉప సంఘంతో ముఖ్యమంత్రి జగన్ ఇవాళ ఉదయం భేటీ అయ్యారు. టెండర్ల ప్రక్రియ మొదలు... అప్పుల వరకూ పైస్థాయిలో ఏదిచూసినా వందలు, వేలకోట్ల రూపాయల్లో కుంభకోణాలు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్ల నిర్మాణంలోనూ అదే పరిస్థితి ఉందని సీఎం అన్నారు. అవినీతి లేకుంటే అవే ఇళ్లు తక్కువ ఖర్చుకు లభించేవి కాదా? అని ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. దీనివల్ల మిగిలే ప్రతి పైసా ప్రజలకే చెందుతుందని గుర్తుంచుకోవాలని సూచించారు. దేశంలోనే అత్యున్నత విధానాలతో అవినీతిరహిత పాలనను అందించే ప్రతి ప్రయత్నానికి సహకరించాలని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులను కోరారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయశాఖమంత్రి కన్నబాబు, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఇరిగేషన్‌శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం, సలహాదారులు శామ్యూల్, సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
"రీ టెండరింగ్"లో వెనక్కు తగ్గేది లేదు : ముఖ్యమంత్రి జగన్
అవినీతిపై రాజీలేని పోరాటం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... మంత్రులకు సూచించారు. రీ టెండరింగ్ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు.
అవినీతిపై పోరాటంలో ఏమాత్రం వెనకడుగు వేయొద్దని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఒత్తిళ్లను ఖాతరు చేయొద్దని సూచించారు. తనపైనా ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయని వాటికి లొంగే ప్రసక్తే లేదన్నారు. ప్రజాధనానికి మనం కాపలాదారులుగా ఉండాలని మంత్రులతో అన్నారు. తాడేపల్లిలోని ఆయన నివాసంలో మంత్రివర్గ ఉప సంఘంతో ముఖ్యమంత్రి జగన్ ఇవాళ ఉదయం భేటీ అయ్యారు. టెండర్ల ప్రక్రియ మొదలు... అప్పుల వరకూ పైస్థాయిలో ఏదిచూసినా వందలు, వేలకోట్ల రూపాయల్లో కుంభకోణాలు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్ల నిర్మాణంలోనూ అదే పరిస్థితి ఉందని సీఎం అన్నారు. అవినీతి లేకుంటే అవే ఇళ్లు తక్కువ ఖర్చుకు లభించేవి కాదా? అని ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. దీనివల్ల మిగిలే ప్రతి పైసా ప్రజలకే చెందుతుందని గుర్తుంచుకోవాలని సూచించారు. దేశంలోనే అత్యున్నత విధానాలతో అవినీతిరహిత పాలనను అందించే ప్రతి ప్రయత్నానికి సహకరించాలని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులను కోరారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయశాఖమంత్రి కన్నబాబు, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఇరిగేషన్‌శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం, సలహాదారులు శామ్యూల్, సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
నెల్లూరు శబరి క్షేత్రంలోని శ్రీ కోదండ రాముని పార్వేట ఉత్సవం వైభవంగా సాగింది. ఉభయకర్తగా వ్యవహరించిన మంత్రి సోమిరెడ్డి కుటుంబసమేతంగా హాజరై స్వామివారికి పూజలు నిర్వహించారు. పార్వేట ఉత్సవాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో తిలకించారు. శబరి క్షేత్రం శ్రీరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేద పండితులు సంప్రదాయబద్ధంగా ఈ ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు తెదేపా నాయకులు హాజరై స్వామివారికి పూజలు నిర్వహించారు.
బైట్: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి.
Body:కిరణ్ ఈటీవీ భారత్
Conclusion:9394450291