ఎట్టి పరిస్థితుల్లోనూ... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే పరిస్థితి ఉండదని తెలంగాణ సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. 5100 రూట్లలో ప్రైవేటు బస్సులకు అనుమతిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. కచ్చితంగా ఆర్టీసీ మనుగడలో ఉంటుందన్నారు. ఆర్టీసీలో కొత్తగా బస్సులు కొనే పరిస్థితి లేదన్నారు. నష్టాల్లో ఉన్న సంస్థ మరింత నష్టాల్లోకి వెళ్లేలా కార్మిక సంఘాలు వ్యవహరించాయని ఆరోపించారు. ఎవరూ ప్రభుత్వాన్ని బెదిరించే పరిస్థితి ఉండకూడదని సీఎం సూచించారు. కార్మికుల సంక్షేమం దృష్ట్యా... నాలుగేళ్ల వ్యవధిలో 67 శాతం వేతనాలు పెంచినట్లు పేర్కొన్నారు. 4 వేల మందికి పైగా ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించినట్లు కేసీఆర్ గుర్తు చేశారు.
సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మరో అవకాశం ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఈ నెల 5లోగా కార్మికులు బేషరతుగా విధుల్లో చేరాలని.. లేకుంటే తర్వాత తీసుకునే ప్రసక్తే లేదని... ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: పవర్ స్టార్ అభిమానులు పండుగ చేసుకునే వార్త..