జగనన్న విద్యా దీవెన పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. విద్యా దీవెనలో భాగంగా సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నామని తెలిపారు. వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, విద్యార్థుల తల్లులతో సీఎం జగన్ మాట్లాడారు. విద్యా దీవెనలో భాగంగా రెండు పథకాలు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బోర్డింగ్, లాడ్జింగ్‌లకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నామన్నారు. పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి.. ఒక్క చదువేనని సీఎం అభిప్రాయపడ్డారు. మంచి చదువులతోనే పేదల బతుకులు మారుతాయన్నారు. మార్చి 31 వరకు ఉన్న పూర్తి బకాయిలను ఇస్తున్నామన్నారు. 2018-19లో గత ప్రభుత్వం పెట్టిన రూ.1880 కోట్ల బకాయిలు పూర్తిగా చెల్లిస్తున్నామన్నారు. ఈ ఏడాదికి సంబంధించి ఒక్క పైసా కూడా బకాయి లేకుండా ఇస్తామని పేర్కొన్నారు. 2020-21లోనూ ప్రతి త్రైమాసికం తర్వాత తల్లుల ఖాతాలో డబ్బులు వేస్తామన్నారు. కళాశాలల్లో సదుపాయాలు లేకపోతే 1902కు తల్లులు ఫోన్ చేసి ఫిర్యాదుచేయవచ్చని చెప్పారు.
ఇదీ చదవండి: