ETV Bharat / city

ఆ తల్లుల గర్భశోకం తీర్చలేనిది : చంద్రబాబు - చంద్రబాబు ట్వీట్

అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన కొందరి తల్లులకు గర్భశోకాన్ని మిగిల్చిందని చంద్రబాబు ఆవేదన చెందారు.

ఆ తల్లుల గర్భశోకం తీర్చలేనిది : చంద్రబాబు

author img

By

Published : May 10, 2020, 10:47 AM IST

చంద్రబాబు ట్వీట్
చంద్రబాబు ట్వీట్

అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఐదేళ్లలో తెదేపా కృషితో మాతాశిశు మరణాల సంఖ్య తగ్గించామని చంద్రబాబు అన్నారు. ప్రసవ మరణాలు తగ్గించి తల్లి ప్రాణాలు కాపాడటానికి అన్న అమృత హస్తం అందించామన్నారు.

ప్రతి ఒక్కరికి తల్లిపట్ల గౌరవం పెంచేందుకు అమ్మవందనం అమలు చేశామన్న ఆయన.. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన కొందరు తల్లులకు గర్భశోకాన్ని మిగిల్చిందని చంద్రబాబు ఆవేదన చెందారు. విశాఖ దుర్ఘటన బాధితులకు ఆత్మస్థైర్యం కల్పించాలని భగవంతుడిని కోరుకుంటున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి : ఆ దృశ్యాలు చూసి షాక్​కు గురయ్యా: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.