మిర్చి విత్తనాల నల్లబజారు, అధికధర నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. నిర్ణీత ధర కంటే ఎక్కువకు విక్రయిస్తే స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. స్వాధీనం చేసుకున్న మిర్చిని ఆర్‌బీకేల ద్వారా సరఫరా చేస్తామని మంత్రి కన్నబాబు వివరించారు.
మిర్చి విత్తనాల సేకరణ, విక్రయం, పంపిణీపై అధికారులకు సూచనలు ఇచ్చారు. మిర్చి విత్తనాలను రైతుభరోసా కేంద్రాల ద్వారా అందించాలని మంత్రి కన్నబాబు ఆదేశించారు.
ఇదీ చదవండీ... 'ఆనందయ్యది ఆయుర్వేదం కాదు..నాటు మందు'