అయోధ్య రామమందిర నిర్మాణానికి హైదరాబాదీ ముస్లిం భారీ విరాళం అందించారు. మున్సురాబాద్ కార్పొరేటర్ కుప్పలు నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో రామాలయ విరాళాల సేకరణ జరిగింది. వివిధ కాలనీలకు చెందిన భక్తులు సుమారు రూ.15 లక్షలు అందజేశారు. గణేష్ నగర్ కాలనీకి చెందిన మౌలానా బాబా సైతం రెండులక్షల పదకొండువేల రూపాయలు అందించారు.
- మౌలానా విరాళం.. ఐక్యతకు నిదర్శనం...
రామాలయ నిర్మాణానికి మౌలానా విరాళం.. హిందూ ముస్లింల ఐక్యతకు నిదర్శనమదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రామమందిర నిర్మాణంలో కులాలు, మతాలకు అతీతంగా భాగస్వాములు కావడం హర్షణీయమని చెప్పారు. ముస్లిం, క్రైస్తవ సోదరులు సైతం విరాళాలు ఇవ్వడం శుభ పరిణామం అని పేర్కొన్నారు. ఎందరో త్యాగాలతో నిర్మిస్తున్న రామాలయంలో ప్రతిఒక్కరూ పాలుపంచుకోవాలని సూచించారు. మన్సురాబాద్ కార్పొరేటర్ కుప్పలు నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో రామాలయ విరాళాల సేకరణ జరిగింది.
ఇదీ చదవండి: వారికి ముందే తెలుసా... చనిపోతున్నారని?