ETV Bharat / city

'రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు' - రాజధానిపై జీవీఎల్ కామెంట్లు

భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాష్ట్ర రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిందని... కేంద్రం ఎలాంటి జోక్యం చేసుకోదని చెప్పారు.

bjp mp gvl narasimha rao
జీవీఎల్ నరసింహారావు
author img

By

Published : Dec 31, 2019, 12:06 AM IST

మీడియా సమావేశంలో ఎంపీ జీవీఎల్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం కేంద్రం పరిధిలోనిది కాదని... ఈ విషయంలో జోక్యం చేసుకునే పరిస్థితి లేదని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. విజయవాడలోని ఓ హోటల్​లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజధాని అంశంపై పార్టీ నుంచి ఎవరు ఏం మాట్లాడినా అది వారి వ్యక్తిగతం తప్ప... పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వీటితోపాటు సీఏఏ, ఎన్ఆర్​సీ అంశాలపై ఆయన స్పందించారు. ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నట్లు సీఏఏ భారతీయులకు ఎలాంటి నష్టం కలిగించదన్నారు. పాకిస్థాన్ లాంటి దేశాల్లో మత వివక్షకు గురై అక్కడ ఇమడలేక... మన దేశానికి వచ్చే వారికి పౌరసత్వం కల్పించేదే సీఏఏ అని స్పష్టం చేశారు. ఈ విషయంలో ముస్లింలను కాంగ్రెస్, ఇతర పార్టీలు ఆందోళనకు గురిచేస్తున్నాయని ఆరోపించారు.

ఇదీ చదవండి: 'అమరావతి రైతుల కోసం నా ప్రాణాలను అడ్డువేస్తా'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.