దేశ భద్రత విషయంలో ప్రధాని మోదీ రాజీలేని పోరాటం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. దేశ చరిత్రలో కొన్ని దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలకు పరిష్కారం చూపారని అన్నారు.
ట్రిపుల్ తలాక్, అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి మార్గం సుగమం చేసిన చరిత్ర మోదీదని కన్నా గుర్తు చేశారు. శరణార్ధుల కోసం సీఏఏ తీసుకొచ్చారన్న ఆయన.. ఇవన్నీ తొలి ఆరు నెలల్లోనే చేసి చూపించారని కొనియాడారు. ప్రధాని మోదీ తిరుగులేని ప్రపంచ స్థాయి నేతగా ఎదుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఇది జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ సీఏఏని అడ్డుపెట్టుకుని అల్లర్లు సృష్టించాలని చూసిందని విమర్శించారు.
ఇదీ చదవండి:
హైకోర్టు తీర్పును గౌరవించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు: నిమ్మగడ్డ