పోలవరంపై వైకాపా ప్రభుత్వం తప్పుడు మాటలు మాని... తప్పు ఒప్పుకోవాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. పోలవరం కోసం కేంద్రంపై వైకాపా పోరాడితే తామూ అందుకు సహకరిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో భాజపా కూడా ఆలోచన చేసి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
పోలవరం ప్రాజెక్టు అంచనాలు 57941 కోట్లకు ఆమోదం తెలపాలని సీఎంగా చంద్రబాబు... నాటి కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాస్తే రూ. 55,541కోట్ల అంచనాలకు ఆమోదం తెలిపారని వెల్లడించారు. వైకాపా ఆరోపిస్తున్నట్లు 25వేల కోట్ల అంచనాలకే చంద్రబాబు లేఖ అని ఎక్కడ రాశారో నిరూపించాలని సవాల్ చేశారు. 55వేల కోట్ల అంచనాలను 45వేల కోట్లకు తగ్గించేటప్పుడు సీఎంగా ఉన్న జగన్ ఎందుకు ఒప్పుకున్నారని నిలదీశారు.
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు సుప్రీంలో వేసిన కేసుకు సమాధానంగా తెదేపా హయాంలో పోలవరం పనులు 71శాతం పూర్తయ్యాయని కేంద్రం వేసిన అఫిడవిట్లో స్పష్టంగా ఉందని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకూ ఇదే సమాధానం వచ్చిందని గుర్తు చేశారు.
ఇదీ చదవండి