రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలపై.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు మంత్రులు కన్నబాబు, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లేఖ రాశారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధంచి.. కేంద్రం నుంచి 4 వేల 724 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇందులో.. 6 వేల కోట్ల రూపాయలకు పైగా రైతులకు చెల్లించినట్టు వివరించారు. మిగిలిన మొత్తాన్ని అప్పు చేసయినా సరే.. తీర్చాల్సిందే అని సీఎం జగన్ నిర్ణయించారని తెలిపారు. రాష్ట్రానకిి ఇబ్బంది కలగకుండా..చొరవ చూపి నిధులు వచ్చేలా చూడాలని ఉపరాష్ట్రపతిని కోరారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, సంస్థల విషయంలోనూ కేంద్రంతో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: