ETV Bharat / city

ఆంగ్ల మాధ్యమంపై ముందుకెళ్లొద్దు: హైకోర్టు

author img

By

Published : Jan 27, 2020, 9:12 PM IST

Updated : Jan 28, 2020, 9:30 AM IST

ఆంగ్లమాధ్యమంపై ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 4కు వాయిదా పడింది.

ap hihgcourt reacts on english medium issue
ఆంగ్లమాధ్యమంపై నిధులు దుర్వినియోగమైతే ప్రభుత్వానిదే బాధ్యత: హైకోర్టు

ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం స్థానంలో ఆంగ్ల మాధ్యమం తీసుకొచ్చే చర్యల్లో భాగంగా పాఠ్యపుస్తకాల ముద్రణ, శిక్షణ తరగతులు తదితర చర్యలు చేపడితే అధికారులకు ఇబ్బందులు తప్పవని హైకోర్టు మరోమారు హెచ్చరించింది. ఈ వ్యవహారంపై ముందుకెళితే ఆ ఖర్చును బాధ్యులైన అధికారుల నుంచే రాబడతామని తేల్చి చెప్పింది. పూర్తిగా ఆంగ్ల మాధ్యమం తీసుకురావడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ నాటికి పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. దాఖలు చేయడంలో విఫలమైతే స్వయంగా హాజరు కావాలని స్పష్టం చేసింది.

నిర్దిష్ట గడువులోపు ప్రమాణపత్రం దాఖలు చేయకపోతే ఆంగ్ల మాధ్యమంపై ‘స్టే’ ఉత్తర్వులు ఇస్తామని తేల్చి చెప్పింది. విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టేందుకు నవంబరు 20న రాష్ట్ర ప్రభుత్వం జీవో 85 జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం రావిపాడు గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు, భాజపా నాయకుడు రాంభొట్ల శ్రీనివాస సుధీష్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌ హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు.

గడువివ్వండి: ఏజీ

సోమవారం జరిగిన విచారణలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయడానికి మరో పది రోజులు గడువు కావాలన్నారు. మాతృభాషలో విద్యను అభ్యసిస్తామంటే నిరాకరించడం లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయ సొలిసిటర్‌ జనరల్‌(ఏఎస్‌జీ) కృష్ణమోహన్‌ వాదనలను వినిపిస్తూ... విద్యా హక్కు చట్టం ప్రకారం కనీసం 8వ తరగతి వరకు బోధన మాతృభాషలో ఉండాలనేది కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయమని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఆంగ్ల మాధ్యమంలోనే చదువుకోవాలని విద్యార్థులను బలవంతపెట్టలేమని ఏజీని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా బలవంతం చేస్తూ ముందుకెలా వెళతారని ప్రశ్నించింది.

పిటిషనర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌ తరఫు న్యాయవాది ఇంద్రనీల్‌బాబు స్పందిస్తూ.. ఆంగ్ల మాధ్యమం అమలు కోసం ప్రభుత్వం పలు చర్యలు చేపడుతూ ముందుకెళుతోందన్నారు. ఈ వ్యవహారంలో ముందుకెళితే అధికారులే బాధ్యత వహించాలని గతంలోనే చెప్పామని ధర్మాసనం గుర్తు చేసింది. ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేసిన అధికారులపై సీబీఐ/ఏసీబీ విచారణకు ఆదేశించి ఆ నిధుల్ని వెనక్కి రాబడతామని ఘాటుగా వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌, సర్వశిక్షా అభియాన్‌ రాష్ట్ర ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, విద్యా పరిశోధన, శిక్షణ రాష్ట్ర మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) డైరెక్టర్‌ను ఆదేశించింది.

ఇదీ చూడండి:

'కార్యాలయాలను తరలిస్తే ప్రభుత్వానిదే బాధ్యత'

sample description
Last Updated : Jan 28, 2020, 9:30 AM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.