HC On Mahila Karyadarshi: గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళ సంరక్షణ కార్యదర్శులను పోలీసు శాఖలో మహిళా పోలీసులుగా పరిగణిస్తూ... గతంలో ప్రభుత్వం జారీచేసిన జీవో 59 స్థానంలో కొత్త జీవో తీసుకొచ్చామని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది వివేకానంద హైకోర్టుకు నివేదించారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. వ్యాజ్యాలను ఉపసంహరించుకొని.. తాజాగా ఇచ్చిన జీవోను సవాలు చేయడానికి పిటిషనర్లకు స్వేచ్ఛనిచ్చింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర, జస్టిన్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాననం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. మహిళ సంరక్షణ కార్యదర్శులను ' మహిళ పోలీసులు' గా పరిగణిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 59ని నవాలు చేస్తూ హైకోర్టులో గతంలో మూడు వ్యాజ్యాలు దాఖలు చేశారు.
ఇదీ చదవండి: 'చలో విజయవాడ' కార్యక్రమానికి అనుమతి లేదు: విజయవాడ సీపీ