ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ టెండర్లలో జ్యుడీషియల్ ప్రివ్యూకి సహకరించేందుకు నిపుణుల కమిటీని నామినేట్ చేస్తూ గృహ నిర్మాణశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ హౌసింగ్ బోర్డు చీఫ్ ఇంజినీర్ సహా ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన చీఫ్ ఇంజినీర్లతో నిపుణుల కమిటీని నామినేట్ చేస్తూ ఆ శాఖ కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చేపట్టే టెండర్లకు సంబంధించి జ్యుడీషియల్ ప్రివ్యూకు సూచనలు, సలహాలను ఈ నిపుణుల కమిటీ ఇస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
టెండర్లలో పారదర్శకత కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జ్యుడీషియల్ ప్రివ్యూకు అనుబంధంగా ఈ కమిటీ గృహ నిర్మాణశాఖలో చేపట్టనున్న ప్రతీ టెండరుకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేసి సిఫార్సులు చేయనుందని ప్రభుత్వం తెలిపింది.
ఇదీ చదవండి : పిండ ప్రదానానికి వెళ్లి.. పెన్నా నదిలో ఏడుగురు గల్లంతు