ETV Bharat / city

కొరత తీరేలా.. పారదర్శక విక్రయం జరిగేలా..!

రాష్ట్రంలో ఇసుక కొరత తీర్చటం.. పారదర్శక విక్రయాల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆన్‌లైన్‌తోపాటు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్‌ చేసుకునే సదుపాయం కల్పించనున్నట్లు రాష్ట్ర భూగర్భగనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ తెలిపారు. దళారీల ప్రమేయం లేకుండా చూడడం సహా.. బుకింగ్‌ పోర్టల్‌ ఎక్కువ సేపు ఉండేలా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. స్థానికులకు ఎడ్లబండ్ల ద్వారా ఉచిత ఇసుకకు అనుమతించటమేగాక... రోజుకు 3 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక తవ్వకాలు జరపాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

కొరత తీరేలా.. పారదర్శక విక్రయం జరిగేలా..!
కొరత తీరేలా.. పారదర్శక విక్రయం జరిగేలా..!
author img

By

Published : Jun 7, 2020, 6:44 PM IST

రాష్ట్రంలో పారదర్శకంగా ఇసుక విక్రయాలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇసుక కొరత లేకుండా వినియోగదారులకు సులభంగా అందించేందుకు.. ఆన్​లైన్​, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా బుక్​ చేసుకునే సదుపాయం కల్పించనున్నట్లు రాష్ట్ర భూగర్భ గనుల శాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ తెలిపారు. ఇసుక విషయంలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ నిర్ణయాలివే..!

  • ప్రభుత్వం నూతన ఇసుక పాలసీని ప్రకటించిన తర్వాత ఏపీఎండీసీ ద్వారా పారదర్శకతతో ఇసుక విక్రయాలు జరుగుతున్నాయి.
  • నూతన విధానం ద్వారా వినియోగదారులకు ఎదురవుతున్న సమస్యలు గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు.
  • రీచ్​లు, స్టాక్ పాయింట్లు, చెక్​పోస్టుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సహా.. గనుల, రెవెన్యూ, రవాణాశాఖల ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీల నిర్వహించడం. స్పెషల్​ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో ద్వారా సోదాలు చేయడం.
  • ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే రెండేళ్ల జైలుశిక్ష, రూ.2 లక్షల జరిమానా విధించేలా చట్టం.
  • రాష్ట్రంలో వాగులు, వంకలతో పాటు చిన్న నీటిపాయల నుంచి ఇసుకను ఎడ్లబండ్ల ద్వారా స్థానికులు ఉచితంగా వాడుకునేందుకు వీలుగా ప్రభుత్వ ఆదేశాలు. ఇందుకోసం పంచాయతీ కార్యాలయంలో రిజిస్ట్రేషన్​ చేయించుకోవాలి.
  • గుర్తించిన వాటర్​ స్ట్రీమ్​ల నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని గ్రామాల ప్రజలు ఇసుకను ఎడ్ల బండ్ల ద్వారా తీసుకెళ్లవచ్చు.

ప్రస్తుతం రోజుకు సగటున 1.25 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని.. త్వరలోనే 3 లక్షల మెట్రిక్​ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గనుల శాఖ సెక్రటరీ ద్వివేదీ స్పష్టం చేశారు. పర్యావరణ నిబంధనల ప్రకారం నాణ్యమైన ఇసుక అందించే నదుల్లోని ఓపెన్ రీచ్​ల్లో కూలీలతోనే ఇసుక తవ్వకాలు జరుపుతున్నామని అన్నారు. ఇకపై బల్క్ బుకింగ్​లను జిల్లా జాయింట్ కలెక్టర్ల పర్యవేక్షణలోనే అనుమతించాలని సీఎం ఆదేశించినట్లు ద్విదేదీ చెప్పారు.

ఇదీ చూడండి..

ఈ నెల 15 లేదా 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు..?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.