ETV Bharat / city

'కొత్తగా ఏర్పాటుచేయాలా? ఉన్నవాటిని తొలగించాలా?' - ఆంధ్రప్రదేశ్​లో రెవెన్యూ డివిజన్ల వార్తలు

రాష్ట్రంలో కొత్తగా 9 రెవెన్యూ డివిజన్లు అవసరమని తాజాగా అంచనా వేస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న రెవెన్యూ డివిజన్లలో నాలుగింటి అవసరం  లేదని భావిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో రెవెన్యూ డివిజన్లను కొత్తగా ఏర్పాటుచేయాలా? ఉన్నవాటిని తొలగించాలా? అన్నదానిపై ప్రభుత్వంలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి.

ap
ap
author img

By

Published : Nov 18, 2020, 7:10 AM IST

రాష్ట్రంలో ప్రస్తుతం 51 రెవెన్యూ డివిజన్లున్నాయి. ఈ జాబితాలో ఉన్న నెల్లూరు జిల్లా ఆత్మకూరు, నాయుడుపేట, పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు, తూర్పుగోదావరి జిల్లా ఎటపాక రెవెన్యూ డివిజన్లను తొలగించాలన్న అంశంపై చర్చ జరుగుతోంది. వీటి పరిధిలో జనాభా, మండలాలు తక్కువగా ఉండడం, రెవెన్యూ డివిజన్‌ కేంద్రం చాలా ప్రాంతాలకు దూరంగా ఉండడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ వీటిని ఈ జాబితా నుంచి తప్పించడంపై పరిశీలిస్తున్నారు.

తెరపైకి కొత్తవి...

విజయనగరం జిల్లా బొబ్బిలి, విశాఖ నగరం భీమిలి, పశ్చిమగోదావరి జిల్లా తణుకు, కృష్ణా జిల్లా నందిగామ, ప్రకాశం జిల్లా చీరాల, కర్నూలు జిల్లా ఆత్మకూరు, చిత్తూరు జిల్లా పలమనేరు, కడప జిల్లా రాయచోటి, గుంటూరు జిల్లా బాపట్లను రెవెన్యూ డివిజన్లను చేయాల్సిన అవసరం కనిపిస్తోందని సచివాలయ అధికారి ఒకరు తెలిపారు. కొత్త జిల్లాలు ఏర్పడితే అక్కడి జనాభా అవసరాలు, పాలనాపరమైన కారణాలరీత్యా ఈ డివిజన్ల అవసరం ఉంటుందని వ్యాఖ్యానించారు. నాలుగింటిని తొలగించి కొత్తగా తొమ్మిది ఏర్పాటుచేస్తే రెవెన్యూ డివిజన్ల సంఖ్య 56కు చేరుతుంది.

ఇదీ చదవండి:

ప్రభుత్వంతో సంప్రదించాక 'పంచాయతీ' షెడ్యూలు: రాష్ట్ర ఎన్నికల సంఘం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.