అమరావతి రైతు కమిటీ సభ్యులతో చర్చలు జరిపిన తర్వాత.. భూములు వేలం వేయాలని రాజధాని కమిటీ నేతలు తేల్చి చెప్పారు. అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలకు రైతులు అభ్యంతరం చెప్పరని.. అదే సమయంలో రాజధానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే సహించబోమని స్పష్టం చేశారు. ఏకైక రాజధానిగా అమరావతే ఉంటుందని స్పష్టం చేసిన తర్వాతే.. భూముల వేలం గురించి ఆలోచించాలని వెలగపూడి ఐకాస కార్యాలయంలో నేతలు సూచించారు.
న్యాయస్థానం దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం ఇలాంటి కార్యకలాపాలకు శ్రీకారం చుట్టిందని ఐకాస నాయకులు విమర్శించారు. అమరావతిని అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే కచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. అమరావతి అభివృద్ధి విషయంలో రాజధాని రైతులను కచ్చితంగా భాగస్వామ్యం చేయాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: