ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ధర్నాలు 175వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు, మందడం, వెంకటపాలెం, తుళ్లూరు, దొండపాడు, రాయపూడి, మల్కాపురం, తాడికొండ, పొన్నేకల్లు మండలాల్లో రైతులు ఆందోళనలు కొనసాగించారు. అమరావతిలోని భారీ బుద్ధుడి విగ్రహం వద్ద మహిళా నాయకులు ఆందోళన చేపట్టారు.
యువజన, దళిత ఐకాస ఆధ్వర్యంలో రాజధాని శంకుస్థాపన జరిగిన ఉద్ధండరాయునిపాలెంలో ధర్నా చేపట్టారు. పవిత్ర మట్టి, ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన శిలాఫలకాల వద్ద కళ్లకు గంతలు కట్టుకొని రాజధానికి మద్దతుగా నినాదాలు చేశారు. రాజధానిగా అమరావతిని కొనసాగించే వరకు తమ పొరాటాన్ని కొనసాగిస్తామని దళిత, యువజన ఐకాస నేతలు తెలిపారు.
ఇదీ చదవండి: ఎల్జీ పాలిమర్స్ కేసు విచారణ ఈ నెల 16కి వాయిదా