ETV Bharat / city

246వ రోజూ కొనసాగిన అమరావతి ఆందోళనలు - అమరావతి రైతులు ఆందోళనలు

రాజధాని అమరావతి రైతులు, మహిళలు 246వ రోజూ ఆందోళనలు కొనసాగించారు. అమరావతి పరిరక్షణ లక్ష్యంగా రాజధాని గ్రామాల్లో నిరనసలు చేశారు. తుళ్లూరు ధర్నా శిబిరంలో వినూత్నంగా నిరసన తెలపగా.... మంత్రివర్గ సమావేశం రీత్యా మందడంలో రైతుల ఆందోళనకు పోలీసులు అనుమతినివ్వలేదు. ఇప్పటివరకు రాష్ట్రప్రభుత్వం కౌలు చెల్లించలేదని, తామెలా బతకాలని రాజధాని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

246వ రోజూ కొనసాగిన అమరావతి ఆందోళనలు
246వ రోజూ కొనసాగిన అమరావతి ఆందోళనలు
author img

By

Published : Aug 19, 2020, 11:06 PM IST

కరోనా పరిస్థితులు... వాతావరణ ప్రతికూల పరిస్థితుల మధ్యే 246వ రోజూ రాజధాని రైతులు, మహిళలు ఆందోళన కొనసాగించారు. తుళ్లూరు, వెలగపూడిలో రైతులు ధర్నాలు నిర్వహించగా... మంత్రివర్గ సమావేశం రీత్యా మందడం శిబిరంలో నిరసనకు పోలీసులు అనుమతివ్వలేదు. దీనిపై అక్కడి రైతులు మండిపడ్డారు. తమ సొంత స్థలంలో నిరసన తెలిపే హక్కులేదా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. తుళ్లూరులో రైతులు, మహిళలు గరిటెలతో కంచాలు, పళ్లాలు కొడుతూ ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. 246 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ రాష్ట్రప్రభుత్వం మొండి పట్టుదల వీడటం లేదని.. కేంద్రప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మొద్దునిద్ర వీడేలా గరిటెలు, పళ్లాలతో గట్టిగా మోగించి తమ నిరసన తెలియజేశామని మహిళా రైతులు చెప్పారు. వారి నిరసనకు మహిళా ఐకాస నేతలు సైతం సంఘీభావం తెలిపారు.

ప్రజాధనంతో ప్రజలపై పోరాటం

ప్రభుత్వానికి భూములు అప్పగించినందుకు శిక్ష అనుభవిస్తున్నామని... రాజధాని గ్రామాల్లో వ్యవసాయం లేకపోతే ఏం తిని బతకాలని రైతులు, మహిళలు ప్రశ్నించారు. తమకు మార్చి-మే నెల మధ్య ఇవ్వాల్సిన కౌలు ఆగస్టు నెల వచ్చినా ఇవ్వలేదని ఆరోపించారు. రాజధాని విషయంలో తమ సొంత డబ్బులతో న్యాయస్థానాలల్లో పోరాడుతున్నామని, రాష్ట్రప్రభుత్వం మాత్రం ప్రజాధనం వెచ్చించి రైతులకు వ్యతిరేకంగా పోరాడుతుందని ఎద్దేవా చేశారు. తమ ఆర్థికమూలాలు దెబ్బతీసేందుకే కౌలు డబ్బుల్ని ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని రైతులు ఆరోపించారు. ఓవైపు వ్యవసాయం సాగక.... మరోవైపు రాజధాని పనులు ఆగిపోతే ఈ ప్రాంత అభివృద్ధి, ఇక్కడ ప్రజల భవిష్యత్తు ఏం కావాలని రైతులు, మహిళలు ప్రశ్నించారు.

మూడు పంటలు పండే భూముల్ని గత ప్రభుత్వానికి అప్పగించామని... ఏ పార్టీకో, నాయకుడికో అప్పగించలేదని రాజధాని రైతులు, మహిళలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : రేపట్నుంచి గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు.. నిర్వహణపై మంత్రి సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.