ETV Bharat / city

వ్యాక్సినేషన్ కార్యక్రమం అమలుకు ఎనిమిది నెలల సమయం! - coronavirus

రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభిస్తే.. మొత్తం 10 కోట్ల డోసులు ఇవ్వాల్సి ఉంటుందని రాష్ట్ర స్థాయి కొవిడ్ టాస్క్ ఫోర్సు అభిప్రాయపడింది. 5 కోట్ల మందికి రెండు డోసుల చొప్పున 10 కోట్ల డోసుల వ్యాక్సిన్ అవసరం అవుతుందని కమిటీ పేర్కొంది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్ వేసేందుకు 8 నెలల సమయం పడుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది.

andhrapradesh
andhrapradesh
author img

By

Published : Jan 6, 2021, 5:56 PM IST

రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం అమలు చేసేందుకు ఎనిమిది నెలల సమయం పట్టే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సచివాలయంలో మొదటి బ్లాక్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కొవిడ్ టాస్క్ ఫోర్సు కమిటీ సమావేశమైంది. రాష్ట్ర జనాభా 5 కోట్ల మందికి రెండు డోసుల చొప్పున 10 కోట్ల డోసుల వ్యాక్సిన్ అవసరం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. దీనికి అనుగుణంగా 3 లక్షల 76 వేల లీటర్ల మేర వ్యాక్సిన్ నిల్వలకు అవకాశం ఉందని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది.

ఎనిమిది నెలల కాలానికి గానూ....

ఈ ఎనిమిది నెలల కాలానికి గానూ 1 కోటీ 31 లక్షల 75 వేల వయల్స్ అవసరం కానున్నట్టు ప్రభుత్వం అంచనా వేస్తోంది. కొవిడ్ వ్యాక్సిన్ నిల్వ కోసం 2 నుంచి 8 డిగ్రీల మధ్య శీతలీకరణ ఏర్పాట్లలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలకు చేరిన 36 లార్జ్ ఐఎల్ఆర్( ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్లు ) అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం జిల్లాలకు రెండేసి చొప్పున ఐఎల్ఆర్​లు, మిగిలిన 10 జిల్లాలకు మూడు చొప్పున ఐఎల్ఆర్​లను కేంద్రం సమకూర్చనుందని ప్రభుత్వం భావిస్తోంది.

తొలి విడతలో వారికే....

తొలి విడత కొవిడ్ వ్యాక్సిన్ కోసం 3.7 లక్షల మంది వైద్యారోగ్య సిబ్బంది, ఆ తదుపరి విడతలో మున్సిపల్, పంచాయితీ పారిశుద్ధ్య సిబ్బంది, రెవెన్యూ, పోలీసు విభాగాలకు చెందిన ఫ్రంట్ లైన్ వర్కర్లు 9 లక్షల మందికి సంబంధించిన జాబితాను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఆ తదుపరి 50 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న 90 లక్షల మందికి కూడా వాక్సిన్ వేసేందుకు జాబితాను కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించనున్నారు. వ్యాక్సిన్ రాగానే వీరికి వాక్సినేషన్ వేసేందుకు గానూ 34 లక్షల సిరంజిలను జిల్లాలకు పంపించారు. డ్రై రన్ సందర్భంగా కొవిన్ యాప్ లో తలెత్తిన సమస్యలపైనా రాష్ట్ర స్థాయి కొవిడ్ టాస్క్ ఫోర్సు కమిటీ చర్చించింది.

ఇదీ చదవండి

కిడ్నాప్ కేసులో ట్విస్ట్: ఏ-1 ఎ.వి.సుబ్బారెడ్డి, ఏ-2గా అఖిలప్రియ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.