ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @9PM - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

.

9pm Top news
9pm Top news
author img

By

Published : Apr 8, 2022, 8:56 PM IST

  • నా వెంట్రుక కూడా పీకలేరు : జగన్
    Cm Jagan Fires : "దేవుడి దయ, ప్రజల దీవెనలు ఉన్నంతకాలం.. విపక్షాలు, మీడియా నా వెంట్రుక కూడా పీకలేరు" అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తాము సంక్షేమం కోసం పాటుపడుతుంటే.. ప్రతిపక్షాలు, మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నంద్యాలలో జగనన్న వసతిదీవెన రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో జగన్ మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Nara lokesh: జగన్​కు ఉన్నంత ఓపిక, తీరిక మాకు లేదు: లోకేశ్​
    Nara lokesh on Cm jagan Comments: నంద్యాల జిల్లాలో నిర్వహించిన సభలో సీఎం జగన్​ చేసిన వ్యాఖ్యలపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​ ఘాటుగా స్పందించారు. జగన్​కు ఉన్నంత ఓపిక, తీరిక తమకు లేదని ఎద్దేవా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • "కరెంటు కోతల్లో.. ఒక విధానం లేదా?" సర్కారు తీరుపై జనాగ్రహం
    రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ కోతలతో ప్రజలు అవస్థలకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో సైతం అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తుండడంతో.. నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ కోతలతో పంటలు నష్టపోతున్నామని ఏలూరు జిల్లా కామవరపుకోటలో రైతులు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాష్ట్రాల విభజన అంశంపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
    రాష్ట్రాల విభజన వ్యవహారంలో నియమ నిబంధనలపై ఉండవల్లి అరుణ్ కుమార్.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఏపీ విభజన విషయంలో తప్పులు జరిగాయని.. నిబంధనలు రూపొందించేలా కేంద్రానికి సూచనలు ఇవ్వాలని పిటిషన్​లో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీకి కేంద్ర కేబినెట్ ఆమోదం
    ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసే పథకానికి కేంద్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమం కోసం సుమారు రూ. 2,700 కోట్లు వెచ్చించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'భాజపా వల్ల దేశంలో చీలిక.. త్వరలో ఉక్రెయిన్ తరహా పరిస్థితులు!'
    కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. భాజపా కారణంగా దేశం చీలిపోయిందన్నారు. సరిహద్దుల విషయంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని.. ఇదే కొనసాగితే ఉక్రెయిన్​లో నెలకొన్న పరిస్థితులు రావొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 18+ వారందరికీ కరోనా టీకా బూస్టర్ డోస్​- ఆదివారం నుంచే...
    కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. 18 ఏళ్లు పైబడ్డ వారందరికీ కొవిడ్ టీకా బూస్టర్ అందించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్​ 10 నుంచి ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వయోజనులు అందరికీ కరోనా టీకా ప్రికాషన్ డోసులు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇమ్రాన్​ ఖాన్​కు పాక్​ సుప్రీంకోర్టు షాక్​.. 'అవిశ్వాసం'పై ఓటింగ్​కు ఆదేశం
    ఇమ్రాన్​ ఖాన్​కు పాకిస్థాన్ సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడం, జాతీయ అసెంబ్లీని రద్దు చేయడం వంటి నిర్ణయాలు రాజ్యాంగ విరుద్దమని స్పష్టం చేసింది. ఏప్రిల్​ 9న సభను నిర్వహించి ఇమ్రాన్ ఖాన్​పై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని స్పీకర్​ను ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'వడ్డీ రేట్లు యథాతథం- కొంతకాలం ధరల భారం ఖాయం!'
    నిపుణుల అంచనాలను నిజం చేస్తూ.. కీలక వడ్డీ రేట్లను వరుసగా 11వ సారి యథాతథంగా ఉంచుతూ ఆర్​బీఐ నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ద్రవ్యోల్బణం పైపైకి ఎగబాకుతున్నా.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ముడి చమురు ధరల పెరుగుదల వంటి అంతర్జాతీయ పరిస్థితుల మధ్య ఈసారి కూడా కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మరో టైటిల్​ వేటలో దూసుకెళ్తున్న సింధు.. సెమీస్​లో శ్రీకాంత్​
    కొరియా ఓపెన్​లో భారత షట్లరు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్​ అదరగొట్టారు. క్వార్టర్​ ఫైనల్లో గెలిచి.. సెమీస్​లో ప్రవేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వరుణ్​ తెేజ్​ 'గని' పంచ్​ బాక్సాఫీస్​పై పడిందా?
    వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా బాక్సింగ్ కథాంశంగా తెరకెక్కిన చిత్రం 'గని'. కిరణ్‌ కొర్రపాటి దర్శకుడు, అల్లు అరవింద్‌ సమర్పకులు. జగపతిబాబు, సునీల్‌ శెట్టి, ఉపేంద్ర, నవీన్‌చంద్ర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం నేడు థియేటర్లలో విడుదలైంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే?. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.