ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7 PM

.

author img

By

Published : Jul 26, 2021, 7:00 PM IST

7pm top news
ప్రధాన వార్తలు @ 7 PM
  • ఇంజినీరింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
    విజయవాడలో తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇంజినీరింగ్ విద్యార్థిని ప్రాణాలుకోల్పోయింది. తరుణ్ అనే యువకుడు కొట్టటం వల్లే చనిపోయిందని బంధువుల ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కొత్తగా 1,627 కరోనా కేసులు
    రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 57,672 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,627 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు.. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • చిన్నారుల గల్లంతు
    విశాఖ జిల్లా వడ్డాది మాడుగుల పెద్దేరులో నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. బట్టలు ఉతికేందుకు పెద్దలతోపాటు పెద్దేరు రేవుకు వెళ్లిన చిన్నారులు..ప్రమాదవశాత్తు ఊబిలో చిక్కుకున్నారు. గల్లంతైన చిన్నారులు మహేందర్ (7), షర్మిల (7), ఝాన్సీ (10), జాహ్నవి (11)గా గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ప్రత్యేక కార్యదర్శిగా ఐఎఫ్ఎస్ అధికారి
    రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి రాహుల్ పాండేను నియమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అటవీశాఖలో చీఫ్ కన్జర్వేటర్​గా పని చేస్తున్న రాహుల్ పాండేను గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • లోక్​సభ సీట్లు 1000కి పెంపు- నిజమెంత?
    దేశంలో లోక్​సభ స్థానాల పెంపు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 2024 సార్వత్రిక ఎన్నికలలోపే.. ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను 1000, అంతకంటే ఎక్కువకు పెంచేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటిలో నిజమెంత? లోక్​సభ సీట్లు పెంచే ఆలోచనతోనే కేంద్రం సెంట్రల్​ విస్టా ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తోందా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఉగ్రవాది హతం
    జిల్లాలోని అహర్బాల్​ ప్రాంతంలో ముష్కరులు ఉన్నట్టు సమాచారంతో భద్రత సిబ్బంది నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రత బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఓ ముష్కరుడు హతమైనట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బస్సుపైనే మేనేజర్​- ఎందుకంటే..
    ఓ ఆర్​టీసీ డిపో మేనేజరు.. ప్రభుత్వ డబ్బు నీటి పాలు అవ్వకుండా ఉండేందుకు ఓ బస్సుపైకి ఎక్కి ఏడు గంటల పాటు ఉన్నారు. అనంతరం అధికారులకు సమాచారం అందించారు. ప్రభుత్వ సొమ్మును కాపాడటం తన బాధ్యత అని మహారాష్ట్ర చిప్లన్​ డిపో మేనేజర్​ రంజిత్​ రాజే షిర్డే పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మింగేసిన మృత్యువు
    ఆమెకు ప్రకృతి అందాలంటే ఎంతో ఇష్టం. ఆ దృశ్యాలను ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడం ఆమెకున్న అలవాటు. అదే విధంగా.. ఆదివారం ఓ ఫొటో తీసి ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది. కానీ అదే ఆమె చివరి పోస్టుగా మిగిలిపోయింది. హిమాచల్​ప్రదేశ్​ కిన్నౌర్​లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె రాజస్థాన్​కు చెందిన దీపా శర్మ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఏఎస్పీగా ఉద్యోగం
    టోక్యో ఒలింపిక్స్​లో సిల్వర్​ మెడల్​తో భారత కీర్తి పతాకాన్ని ఎగరేసిన చానుకు.. ఇప్పటికే సొంత రాష్ట్రమైన మణిపూర్​ సీఎం బీరేన్ సింగ్ కోటి రూపాయల నగదు పురస్కారం ప్రకటించారు. అయితే స్వదేశానికి రాగానే మరో సర్​ప్రైజ్ ఇస్తామని చెప్పారాయన. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ట్రైలర్ రిలీజ్
    యువనటుడు సత్యదేవ్ హీరోగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'తిమ్మరుసు'. జులై 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్​ను విడుదల చేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.