ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7 PM

.

ప్రధాన వార్తలు @ 7 PM
ప్రధాన వార్తలు @ 7 PM
author img

By

Published : Nov 12, 2020, 6:57 PM IST

  • గుంటూరు జిల్లా జైలు నుంచి రాజధాని రైతులు విడుదల

గుంటూరు జిల్లా జైలు నుంచి కృష్ణాయపాలెం రైతులు విడుదలయ్యారు. వీరికి అమరావతి ఐకాస, తెదేపా, సీపీఐ నేతలు స్వాగతం పలికారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రాష్ట్రంలో కొత్తగా 1,728 కరోనా కేసులు, 9 మరణాలు నమోదు

రాష్ట్రంలో గురువారం కొత్తగా 1,728 కరోనా కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,49,705కు చేరగా... మృతుల సంఖ్య 6,837కు పెరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • దేవాలయాల ఆస్తులపై ప్రభుత్వ కన్ను: సోము వీర్రాజు

హిందూ దేవాలయాల ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వ కన్ను పడిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. 5 వేల కోట్ల రూపాయల డిపాజిట్లను ప్రభుత్వ ఖజానాకు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ప్రమాణాలు పాటించని కళాశాలల్లో ప్రవేశాలు రద్దు

జేఎన్టీయూ అనంతపురం పరిధిలో ప్రమాణాలు పాటించని కళాశాలలు మూసివేతకు గురవుతున్నాయి. ప్రవేశాలు లేకపోవడం, నాణ్యమైన విద్య అందించకపోవడం వంటి కారణాలతో 24 ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ఈ ఏడాది ప్రవేశాలను అధికారులు నిలిపివేశారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • సోమవారమే సీఎంగా నితీశ్​ ప్రమాణం!

బిహార్​లో ఎన్నికల హడావుడి ముగిసింది. ఇక మిగిలింది ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారమే. అయితే ఈ వేడుక సోమవారం జరిగే అవకాశముంది. భాయ్ దూజ్​ పండుగ సందర్భంగా నితీశ్​కుమార్​ సీఎం బాధ్యతలు చేపట్టనున్నట్టు జేడీయూ వర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'భారత్​-ఆసియాన్​ కనెక్టివిటీ పెంచడమే లక్ష్యం'

వియాత్నాం ఆధ్వర్యంలో జరుగుతున్న 17వ ఆసియాన్​ సదస్సులో వర్చువల్​గా పాల్గొన్నారు ప్రధాని మోదీ. భారత్​- ఆసియాన్​ దేశాల మధ్య అనుసంధానత పెంచడమే తమ ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో భద్రత, అభివృద్ధిని మెరుగుపరిచేందుకు ఆసియాన్​ బృందం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'ఇప్పట్లో భారీ డ్యాంల నిర్మాణం లేనట్టే!'

దేశంలో భూగర్భ జలాలను పెంచాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​. భవిష్యత్తు తరాల మనుగడకు, ప్రస్తుత నీటి భద్రతకు భూగర్భ జలాలు చాలా ముఖ్యమన్నారు. అయితే.. దేశంలో పెద్ద పెద్ద జలాశయాలు నిర్మించేందుకు అనువైన ప్రదేశాలు లేవని పేర్కొన్నారు మంత్రి.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఫిలిప్పీన్స్​ను వణికిస్తోన్న 'వామ్కో' తుపాను

ఫిలిప్పీన్స్​ను మరో తుపాను వణికిస్తోంది. 'గోని' విలయం నుంచి కోలుకోకముందే 'వామ్కో' రూపంలో ఆ దేశంలో మరో ముప్పు ఎదురైంది. ప్రమాదకర స్థాయిలో గంటకు 140కి.మీ-195 కి.మీ వరకు గాలులు వీస్తున్నాయి.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • టీ20 ప్రపంచకప్​ నిర్వహణ.. మాకు దక్కిన గౌరవం

టీ20 ప్రపంచకప్​ను భారత్​లో నిర్వహించడం తమకెంతో గర్వకారణమని బీసీసీఐ అధ్యక్షుడు​ గంగూలీ అన్నాడు. టోర్నీ నిర్వహణ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • మరో హిందీ నటుడు ఆత్మహత్య

ఈ మధ్య కాలంలో బాలీవుడ్​లో ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. గురువారం సీనియర్ నటుడు అసిఫ్ బస్రా ఉరి వేసుకుని తుదిశ్వాస విడిచారు. మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.