ETV Bharat / city

ఉక్కు పాదాల కిందే..ఉవ్వెత్తున ఉద్యమజ్వాల - రాజధాని అమరావతి కోసం నిరసన

రాష్ట్రం కోసం.. రాజధాని కోసం భూములిచ్చిన తమకు న్యాయం చేయాలన్నవారి నిరసన మార్మోగుతోంది.. వారాలు, నెలలు కాదు.. ఏడాదిగా ఆ ఆకాంక్ష అగ్నిజ్వాలై ఎగిసిపడుతోంది. అడుగడుగునా నిర్బంధాలు..  ఎదురుతిరిగితే లాఠీదెబ్బలు.. అడ్డుచెబితే పోలీసు కేసులు.. ఇన్ని ప్రతికూలతలు వెనక్కి లాగుతున్నా.. ప్రభుత్వం అన్నిరకాలుగా అణిచివేస్తున్నా ఆ ఉద్యమ స్వరం ఆగలేదు. వారి నినాదాల హోరు తగ్గలేదు. కరోనా మహమ్మారి ముంచుకొచ్చినా అమరావతి పోరాటం ఆగలేదు అమరావతే తమ నినాదమని..రాజధాని సాధనే అంతిమ లక్ష్యమనిఅక్కడ ప్రతి గొంతూ నిత్యం నినదిస్తోంది.

365 DAYS OF AMRAVATI MOVEMENT
అమరావతి ఉద్యమానికి ఏడాది
author img

By

Published : Dec 17, 2020, 7:45 AM IST

వ్యవసాయం తప్ప మరో మాటే తెలియని వారంతా ఏడాదిగా ఉద్యమమే ఊపిరిగా బతుకుతున్నారు. మహిళలు ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. రాజధాని గ్రామాల రైతులు, రైతు కూలీలు కలసి రైతు ఐకాస ఏర్పాటు చేసుకుని ఉద్యమిస్తుంటే, రాజధాని గ్రామాలకు వెలుపల వివిధ వర్గాలవారు అమరావతి పరిరక్షణ సమితి పేరుతో పోరాటం కొనసాగిస్తున్నారు. ధర్నాలు, ర్యాలీలు, మౌన ప్రదర్శనలు, నిరాహార దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు, యజ్ఞాలు, దేవుళ్లకు మొక్కులు, దేశ ప్రధాని మొదలు ప్రముఖులకు లేఖలు, రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని, కేంద్ర మంత్రుల్ని, వివిధ పార్టీల జాతీయ నాయకుల్ని స్వయంగా కలసి తమకు మద్దతివ్వాలని అభ్యర్థనలు, సామాజిక మాధ్యమాల్లో సందేశాలు.. ఇలా ఈ ఏడాది కాలంలో వారు చేయని ప్రయత్నం లేదు.. పాలకుల మనసు మారాలని చేయని ప్రార్థన లేదు. ఈ ఏడాది కాలంలో రాజధాని తరలిపోతుందన్న మానసిక వేదనతో రాజధాని గ్రామాలకు చెందిన 118 మంది రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు మరణించారని అమరావతి రైతు ఐకాస ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని ప్రశాంతంగా ఉద్యమిస్తున్న ప్రజలపై ఉక్కుపాదం.. ఆంక్షల చక్రబంధంలో పల్లెలు.. అడుగడుగునా అడ్డంకులు, అవరోధాలు, నిర్బంధాలు.. పక్క ఊరికి వెళ్లాలన్నా సవాలక్ష ప్రశ్నలు.. ప్రశాంతమైన గ్రామాల్లో ఖాకీ బూట్ల పదఘట్టనలు... అర్ధరాత్రి తనిఖీలు, అడ్డొస్తే లాఠీఛార్జిలు... ఉద్యమకారులకు బెదిరింపులు.. ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు...

అయినా..

వారు భయపడలేదు. ఎత్తిన ఉద్యమ జెండా దించలేదు. పాలకులు కన్నెర్రజేసినా, పోలీసులు లాఠీలు ఝుళిపించినా, ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు అనేక కుట్రలు పన్నినా, కరోనా ఉరిమినా.. ఉద్యమ స్ఫూర్తి వీడలేదు. ఒకరోజు కాదు. ఒక వారం కాదు. ఒక నెలతో ఆగలేదు. ఏకంగా ఏడాది కాలంగా రాజధాని రైతులు ఉద్యమిస్తూనే ఉన్నారు. అమరావతి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రభుత్వం తమతో చేసుకున్న ఒప్పందం అమలు కోసం... అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. వానొచ్చినా.. ఎండొచ్చినా.. పండగొచ్చినా... పోరాటం ఆపలేదు. ఒక్కరోజూ విరామం లేకుండా ఉద్యమ నినాదం వినిపిస్తూనే ఉన్నారు. మరోపక్క న్యాయపోరాటమూ చేస్తున్నారు.

2019 డిసెంబరు 17న సాయంత్రం అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్‌ మూడు రాజధానుల ప్రస్తావన చేయడం రాజధాని ప్రజలకు శరాఘాతమైంది. అదే రోజు రాత్రి వారంతా వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేశారు. మర్నాటి నుంచే రాజధాని గ్రామాల్లో అమరావతి పరిరక్షణ ఉద్యమం మొదలైంది. ప్రభుత్వం వేల సంఖ్యలో పోలీసుల్ని రాజధాని గ్రామాల్లో మోహరించింది. 144 సెక్షన్‌తో పాటు, పోలీసు చట్టంలోని సెక్షన్‌ 30ని ప్రయోగించింది. ఉద్యమాన్ని కట్టడి చేయాలని చూసింది. పోలీసులు రాజధాని గ్రామాల్ని పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. ఉద్యమంలో చురుగ్గా ఉన్న ప్రతి వ్యక్తిపైనా నిఘా వేశారు. ఆంక్షలు, నిర్బంధాలతో భయభ్రాంతులకు గురిచేశారు. ఒక ఊరి వ్యక్తి పొరుగూరికి వెళ్లాలన్నా గుర్తింపుకార్డు చూపించాల్సిన దుస్థితి. ఆ సమయంలో ఏ గ్రామంలో చూసినా వేల సంఖ్యలో పోలీసులుండేవారు. ప్రజలపై నిఘాకు డ్రోన్లు ఉపయోగించారు. శిక్షణలో ఉన్న మహిళా కానిస్టేబుళ్లను కూడా విధుల్లో నియమించారు. రాజధాని ప్రజలు రోడ్లపై నిరసన చెబుతుంటే అడ్డుకున్నారు. ప్రైవేటు స్థలాల్లో టెంట్లు వేసుకుని నిరసన తెలుపుతున్నా.. అనుమతుల్లేవని బెదిరించేవారు. రహదారులకు అడ్డుగా ముళ్లకంచెలు వేసేవారు. ఇళ్లల్లోకి వెళ్లి అర్ధరాత్రి తనిఖీలు చేశారు. ముఖ్యమంత్రి సచివాలయానికి వెళుతుంటే ఆరేడు కిలోమీటర్ల దూరంలోని తుళ్లూరు వద్దే ట్రాఫిక్‌ ఆపేసేవారు. విజయవాడ దుర్గమ్మకు పొంగళ్లు సమర్పించి, వేదన వెళ్లబోసుకునేందుకు మహిళలు వెళుతుంటే పోలీసులు అడ్డుకుని లాఠీఛార్జి చేశారు. ఆ దాడిలో పలువురు మహిళలు గాయపడ్డారు. ఒక మహిళ గొంతు పట్టుకుని పోలీసులు గట్టిగా నొక్కడంతో ఇప్పటికీ ఆమె సరిగ్గా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. అసెంబ్లీ ముట్టడికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన రాజధాని ప్రజలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. నిరసనగా ఆ మర్నాడు మందడంలో దీక్ష చేస్తున్న మహిళలపైనా లాఠీలు ఝుళిపించారు. ఒక గర్భిణిని పోలీసు అధికారి కాలితో తన్నడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స చేయించుకుని అత్తారింట్లో విశ్రాంతి తీసుకుంటుంటే.. రాజధానిలో జరిగిన మరో సంఘటనలో ఆమెపై అక్రమంగా కేసు పెట్టారు. మందడంలో మహిళలపై దాడి తర్వాత హైకోర్టు మందలించడంతో రాజధాని గ్రామాల్లో పోలీసు నిర్బంధం కొంత తగ్గింది. 144 సెక్షన్‌ తొలగించారు. అయినా ఇప్పటికీ ఏదో ఒక రూపంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి.

ఏడాది పోరు.. 4 దశలు
తొలి దశ: సీఎం ప్రకటనతో ఉవ్వెత్తున మొదలై

2019 డిసెంబరు 17న ముఖ్యమంత్రి అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేయడంతో ఉద్యమం మొదలైంది. తుళ్లూరు, మందడం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లో మొదలై.. రాజధాని గ్రామాలన్నింటికీ విస్తరించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోనూ ఆందోళనలు జరిగాయి. రాజధాని రైతులు ప్రత్యేకంగా జేఏసీ ఏర్పాటు చేసుకున్నారు. వైకాపా తప్ప, అన్ని పార్టీల నేతలు, ఆధ్యాత్మిక, సినీ ప్రముఖులూ, ఇతర రాష్ట్రాల రైతు నాయకులు మద్దతు ప్రకటించారు.

రెండో దశ: అసెంబ్లీలో బిల్లులతో ఉద్ధృతం

2020 జనవరిలో ప్రభుత్వం మూడు రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లుల్ని శాసనసభలో ప్రవేశపెట్టింది. తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య ఆ బిల్లుల్ని సెలక్ట్‌ కమిటీకి పంపిస్తూ మండలి నిర్ణయం తీసుకుంది. అప్పుడే అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన రాజధాని ప్రజలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. మందడంలో దీక్ష చేస్తున్న వారిపై పోలీసులు దాడి చేయడంతో ఒక మహిళ తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని రైతులు 12, 24, 50, 151 గంటలు నిరాహారదీక్షలు చేపట్టి ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు.

మూడో దశ: కరోనావేళా ఆగని ఉద్యమం

కరోనా దెబ్బకు ప్రపంచమంతా బెంబేలెత్తుతున్న సమయంలోనూ రాజధాని రైతులు ఉద్యమాన్ని ఆపలేదు. భౌతిక దూరం, నిబంధనలు పాటిస్తూ ఉద్యమం కొనసాగించారు. రైతులు ట్విటర్‌, ఫేస్‌బుక్‌ ద్వారానూ నిరసన తెలుపుతున్నారు.

నాలుగో దశ: బిల్లులకు గవర్నర్‌ ఆమోదంతో..

మూడు రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులకు ఈ ఏడాది జులై 31న గవర్నర్‌ ఆమోదముద్ర వేశారు. అప్పటి నుంచి రాజధాని రైతులు, అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ఆ చట్టాల్ని హైకోర్టులో సవాల్‌ చేశారు.

కేసులు... బెదిరింపులు

రాజధాని రైతు ఐకాస చెబుతున్న వివరాల ప్రకారం.. రాజధాని గ్రామాలకు చెందిన దాదాపు 700 మందిపై పోలీసులు పలు కేసులు పెట్టారు. వాటిలో నాలుగు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నాయి. బాధితులపైనే కేసులు పెట్టడం, ఎస్సీ, ఎస్టీలపైనా అట్రాసిటీ కేసులు ప్రయోగించడం వంటి చర్యలతో పోలీసుల తీరు తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. మందడంలో పోలీసుల డ్రోన్‌ను ధ్వంసం చేశారంటూ 45 మంది మీద కేసు పెట్టారు. పెదపరిమిలో మామూలు దుస్తుల్లో వచ్చిన పోలీసులు.. ఆందోళన చేస్తున్న మహిళల్ని ఫొటోలు తీశారు. మీరెవరని నిలదీసినందుకు 20 మందిపై కేసు పెట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని, విధులకు అవరోధం కలిగించారంటూ చాలా కేసులు పెట్టారు. రాజధాని ఉద్యమంలో వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొనకుండా అధికారులు ఆంక్షలు విధించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌ ఇవ్వబోమని యాజమాన్యాల్ని బెదిరించారు.

నైతికంగా దెబ్బతీసేందుకు దుష్ప్రచారం

అమరావతి పరిరక్షణ కోసం చేస్తున్న ఉద్యమాన్ని నైతికంగా దెబ్బతీసేందుకూ అనేక ప్రయత్నాలు జరిగాయని అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో అసలే పనులూ జరగలేదని, శాశ్వత నిర్మాణాలే లేవని, గత ప్రభుత్వం అన్నీ గ్రాఫిక్స్‌ చూపించిందని మంత్రులు, అధికార పార్టీ నాయకులు పదేపదే ప్రచారం చేశారని చెప్పారు. ‘అమరావతి అడవిలా ఉందని ఒకరు, శ్మశానమని మరొకరు వ్యాఖ్యానించారు. అది ముంపు ప్రాంతమని, కృష్ణా నదికి వరదలు వస్తే మునిగిపోతుందని దుష్ప్రచారం చేశారు. దాన్ని వివిధ వేదికలపైనా, మాధ్యమాల్లోనూ తిప్పికొట్టాం. దిల్లీ స్థాయిలోనూ మా గళం వినిపించాం’ అని అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌ గద్దె తిరుపతిరావు పేర్కొన్నారు.

చందాలు వేసుకుని న్యాయపోరాటం

రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్‌ విధించడం, మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం, జీఎన్‌రావు కమిటీ నియామకం, మూడు రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దు, విజిలెన్స్‌ కమిషన్‌, ఎంక్వైరీ కమిషనరేట్లను కర్నూలుకు తరలిస్తూ ఉత్తర్వులివ్వడం వంటి పలు ప్రభుత్వ నిర్ణయాల్ని సవాల్‌ చేస్తూ రాజధాని రైతులు, అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు హైకోర్టులో కేసులు వేశారు. విజిలెన్స్‌ కమిషన్‌, ఎంక్వైరీ కమిషనరేట్ల జీవోను కోర్టు రద్దు చేసింది. రాజధాని భూముల్లో ఇతర ప్రాంతాలకు చెందిన పేదలకు ఇళ్ల స్థలాలిస్తామన్న ఉత్తర్వులనూ రద్దు చేసింది. మూడు రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దు చట్టాల అమలుపై స్టే ఇచ్చింది. రాజధాని రైతులు, అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు చందాలు వేసుకుని న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి:

365 రోజుల అమరావతి ఉద్యమానికి.. 365 సెకన్ల దృశ్యరూపం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.