ETV Bharat / city

Top News: ప్రధాన వార్తలు @ 11 AM - ఆంధ్రప్రదేశ్ ప్రధానాంశాలు

ప్రధాన వార్తలు @ 11 AM

11am top news
ప్రధాన వార్తలు @ 11 AM
author img

By

Published : Jul 28, 2021, 10:58 AM IST

  • దేవినేనిపై హత్యాయత్నం కేసు

కృష్ణా జిల్లా నందివాడ పోలీస్ స్టేషన్‌లో ఉన్న తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దేవినేనిపై అట్రాసిటీ, 307 సెక్షన్లు కింద జి.కొండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దేవినేని హత్యాయత్నానికి పాల్పడినట్లు.. 307 సెక్షన్‌ కింద అభియోగాలు మోపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అత్యవసర సమావేశం

మాజీ మంత్రి దేవినేని ఉమాపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన వైకాపా నేతలను వదిలిపెట్టి.. తెలుగుదేశం పార్టీ నేతలపై హత్యాయత్నం కేసు పెట్టడం ఏంటని పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ముంపు మండలాల ప్రజలకు బెడద..!

పోలవరం ముంపు మండలాల్లో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గోదావరిని ముంచెత్తుతున్న వరద.. కాపర్‌ డ్యాం ప్రభావంతో ముంపు మండలాల్లోకి చొచ్చుకు పోతోంది. ఇప్పటికే అనేక గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. చేసేదిలేక సమీపంలోని కొండల్లోకి వెళ్లి బాధితులు తలదాచుకుంటున్నారు. సొంత ఖర్చులతో చిన్న గుడిసెల్లోనే నివాసం ఉంటున్నారు. అధికారులు కనీసం కన్నెత్తి చూడలేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 20 వేల లీటర్లు నేల'పాలు'!

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని భాకరాపేట కనుమ దారిలో ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. పీలేరు నుంచి తిరుపతికి వస్తున్న పాల ట్యాంకర్.. అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్​కు స్వల్ప గాయాలయ్యాయి. గత కొద్ది రోజుల క్రితం.. టమోటా, కోళ్లు, కెమికల్, ఐరన్ లారీలు లోయలో పడ్డాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారీగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు(Coronavirus India) మంగళవారంతో పోలిస్తే భారీగా పెరిగాయి. కొత్తగా 43,654 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరో 640 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 41,678 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఎనిమిది మంది మృతి

భారీ వర్షాల కారణంగా జమ్ము కశ్మీర్​లో సంభవించిన ఆకస్మిక వరదల ధాటికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది వరకు ఆచూకీ గల్లంతైంది. కిష్టావర్ జిల్లాలోని హోంజర్ అనే మారుమూల గ్రామంలో ఈ వరదలు సంభవించాయని అధికారులు తెలిపారు. గ్రామంలో సుమారు తొమ్మిది ఇళ్లు ధ్వంసమయ్యాయని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భుజాలపై మోసి.. నది దాటించి

మధ్యప్రదేశ్​ అగర్​ మాల్వా జిల్లాను భీకర వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదల ప్రభావంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో చోమా గ్రామానికి చెందిన కొంతమంది.. ఓ కాలువను దాటేందుకు నానా అవస్థలు పడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రపంచదేశాల్లో మళ్లీ పెరుగుతున్న కేసులు

డెల్టా వేరియంట్​ వైరస్​.. క్రమంగా ప్రపంచ దేశాలపై పంజా విసురుతోంది. అమెరికాలో కొత్తగా రికార్డు స్థాయిలో 61,581 కేసులు నమోదయ్యాయి. ఇరాన్​లోనూ.. అత్యధికంగా 34,951 మందికి వైరస్ నిర్ధరణ అయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రి క్వార్టర్స్​లోకి ఎంట్రీ

ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. గ్రూఫ్‌ దశలో హాంకాంగ్‌కు చెందిన చెయుంగ్‌ ఎంగన్‌పై 21-9, 21-16తో వరుస సెట్లల్లో విజయం సాధించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అస్సలు దాచుకోవట్లేదుగా!

నియా శర్మ.. హిందీలో పలు సీరియళ్లతో ప్రేక్షకులకు దగ్గరైంది. వెబ్​సిరీస్​ల్లో నటించి మరింత క్రేజ్​ సంపాదించుకుంది. త్వరలోనే సినిమాల్లోకి రానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.