కుప్పం తెదేపా అధినేత కంచుకోట. శాసనసభ స్థానానికి 1989 నుంచి ఇప్పటివరకు చంద్రబాబు ఆరుసార్లు గెలుపొందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలుపెరుగని జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు. ఏడోసారి పోటీలో ఉన్నారు. అయితే ఈ నియోజకవర్గంలో చంద్రబాబు ఓ సెంటిమెంట్ ఉంది. విరాళాలు సేకరించిన సొమ్ముతో నామినేషన్ డిపాజిట్ చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది.
చంద్రబాబు నామినేషన్‌కు విరాళాలు
1999 నుంచి తెదేపా అధినేత చంద్రబాబు నామినేషన్ డిపాజిట్ సొమ్మును ప్రజల నుంచి విరాళంగా సేకరించడం సంప్రదాయంగా వస్తోంది. కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో తెలుగు తమ్ముళ్లు ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తుంటారు. ఐదురోజుల పాటు తిరిగి నగదు సేకరిస్తారు. మహిళా సంఘాల నేతలే నామినేషన్ పత్రాలు దాఖలు చేసి..ధరావత్ చెల్లించడం సెంటిమెంట్‌గా కొనసాగుతోంది.
డిపాజిట్ అంటే ఏమిటి..?
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు రిటర్నింగ్ అధికారి వద్ద కొంత నగదు జమ చేయాలి. ఆరో వంతు కన్నా తక్కువ ఓట్లొస్తే డిపాజిట్ కోల్పోయినట్టు లెక్క. అందరి మాదిరిగానే చంద్రబాబు..కార్యకర్తలు, అభిమానులు ప్రేమతో ఇచ్చిన డబ్బులతో డిపాజిట్ చెల్లిస్తుంటారు. మార్చి 22న చంద్రబాబు తరపున వెలుగు సంఘాలు, పార్టీ శ్రేణుులు నామినేషన్ దాఖలు చేయనున్నాయి.
ఇది కూడా చూడండి:వాట్సప్‌లో జోరు.. ఫేస్బుక్లో హోరు