ETV Bharat / state

AP Fiber net case: సీఐడీ ఎదుట హాజరైన ముగ్గురు నిందితులు.. - ap fibernet cid investigation

Fiber net case
Fiber net case
author img

By

Published : Sep 14, 2021, 11:43 AM IST

Updated : Sep 14, 2021, 12:34 PM IST

11:39 September 14

ఫైబర్‌ నెట్‌ కేసు విచారణ

ఏపీ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌లో గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై సీఐడీ విచారణ చేపట్టింది. సోమవారం ముగ్గురికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేయగా.. ఇవాళ మంగళగిరి సీఐడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు వారు హాజరయ్యారు. టెండర్ల సాంకేతిక మదింపు కమిటీలో సభ్యుడిగా వ్యవహరించిన వేమూరి హరికృష్ణ ప్రసాద్, ఇన్‌క్యాప్‌ అప్పటి ఎండీ కె.సాంబశివరావు, టెరా సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఎండీ తుమ్మల గోపీచంద్‌.. సీఐడీ విచారణకు హాజరయ్యారు. విజయవాడ సత్యనారాయణపురంలో సీఐడీ ఎదుట సాంబశివరావు హాజరయ్యారు.

అసలేం జరిగిందంటే..

ఏపీ ఫైబర్‌నెట్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ మేరకు సీఐడీకి ఆదేశాలిస్తూ.. ప్రభుత్వ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కాంట్రాక్టర్‌కు అనుకూలంగా టెండర్లను ఖరారు చేశారన్నారు. ఈ అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఏపీ ఫైబర్‌నెట్ ఎండీ ప్రభుత్వానికి నివేదించారు. ఈ ప్రాథమిక నివేదిక ఆధారంగా కేసును సీఐడీకి అప్పగించారు. ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని సీఐడీ అదనపు డీజీని ఆదేశించారు.

ఏపీ ఫైబర్ నెట్​కు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో 121 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు సీఐడీ విచారణలో గుర్తించామని.. ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌ నెట్ లిమిటెడ్(APSFL) ఛైర్మన్ పి. గౌతమ్​రెడ్డి సోమవారం తెలిపారు. సాంకేతిక పరికరాలు సంస్థకు చేరకుండానే బిల్లులు మంజూరు చేశారని..వీటితో పాటు సాంకేతికపరంగా పలు రకాల అవకతవకలు జరిగాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా టెరా సాఫ్ట్ సంస్థను బ్లాక్ లిస్టు తొలగించారని.. దీనిపై అభ్యంతరాలు, ఫిర్యాదులను పట్టించుకోలేదన్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు 18మందిని అనుమానితులుగా గుర్తించి సీఐడీ కేసులు నమోదు చేశారన్నారు. బాధ్యులు ఎంతటి వారైనా సరే సీఐడీ చర్యలు తీసుకుంటుందన్నారు.

నిందితులు వీరే..: 

నిందితుల జాబితాలో టెండర్ల సాంకేతిక మదింపు కమిటీకి అప్పట్లో సభ్యుడిగా వ్యవహరించిన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌తో పాటు ఇన్‌క్యాప్‌ అప్పటి ఎండీ కె.సాంబశివరావు, టెరా సాఫ్ట్‌వేర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ, దాని ఛైర్మన్‌ ఎస్‌ఎస్‌ఆర్‌ కోటేశ్వరరావు, ఎండీ టి.గోపీచంద్‌, డైరెక్టర్లు ఆర్‌.ఎస్‌.బక్కనవర్‌, టి.హనుమాన్‌ చౌదరి, డా.టి.వి.లక్ష్మి, టి.బాపయ్య చౌదరి, టి.పవనదేవి, కె.రామారావు, హిమాచల్‌ ఫ్యూచరిస్టిక్‌ కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ సంస్థ, దాని డైరెక్టర్లు ఎం.పి.శుక్లా, మహేంద్ర నెహతా, అరవింద్‌ ఖర్బందా, డా.ఆర్‌.ఎం.కస్తియా, రాజీవ్‌ శర్మ, బేలా బెనర్జీ ఉన్నారు. వీరితోపాటు కొందరు ప్రభుత్వోద్యోగులు, ఇతరులనూ నిందితులుగా పేర్కొంది. వారి పేర్లు ప్రస్తావించలేదు.

ఇదీ చదవండి: 

APSFL: 'ఫైబర్‌ నెట్​లో రూ. 121 కోట్ల అక్రమాలు..బాధ్యులెవరైనా చర్యలు..'

Last Updated : Sep 14, 2021, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.