ETV Bharat / snippets

దశాబ్దాలు గడిచినా ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ పార్టీ దాడి కొనసాగుతోంది : కేటీఆర్

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 25, 2024, 4:42 PM IST

KTR
KTR (ETV Bharat)

KTR Comments on Congress : 49 ఏళ్ల క్రితం ఇదే రోజు కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ విధించి, పౌర హక్కులను హరించిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య హక్కులను, ప్రజల గొంతుకలను అణచి వేసిందని కేటీఆర్ తెలిపారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, దశాబ్దాలు గడిచినా ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ పార్టీ దాడి కొనసాగుతోందని మండిపడ్డారు.

పార్లమెంటులో కాంగ్రెస్ నేతలు భారత రాజ్యాంగం కాపీలను పట్టుకున్నారని, కానీ కొన్ని కిలోమీటర్ల దూరంలో వారి పార్టీ ప్రధాన కార్యాలయంలో, పార్టీ నాయకులు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. తద్వారా కాంగ్రెస్ నేతలు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. వంచనకు కాంగ్రెస్ పార్టీ ప్రతిరూపమని ఎద్దేవా చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.