ETV Bharat / snippets

రైల్వే భద్రతపై పటిష్టమైన చర్యలు చేపట్టాం: హుబ్లీ డివిజనల్ మేనేజర్ హర్ష కరే

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 19, 2024, 12:50 PM IST

Hubli Railway Manager Visit Raidurgam Station
Hubli Railway Manager Visit Raidurgam Station (ETV Bharat)

Hubli Railway Manager Visit Raidurgam Station: రైల్వే భద్రతపై పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు హుబ్లీ డివిజనల్ రైల్వే మేనేజర్ హర్ష కరే వెల్లడించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని రైల్వే స్టేషన్​ను డీఆర్ఎం బుధవారం తనిఖీ చేశారు. హుబ్లీ నుంచి ఉదయమే రాయదుర్గంకు ప్రత్యేక రైలులో చేరుకున్న ఆయనకు రైల్వే అధికారులు ఘన స్వాగతం పలికారు. రాయదుర్గంలో నిర్మించిన నూతన రైల్వే ట్రాక్​ను ఆయన పరిశీలించారు. రాయదుర్గంలో నిర్మాణ దశలో ఉన్న నూతన రైల్వే భవనాలను పరిశీలించారు. పశ్చిమ బెంగాల్​లో జరిగిన రైల్వే ప్రమాద ఘటన వివరిస్తూ భద్రతా ప్రమాణాల పెంపుపై దిశానిర్దేశం చేసినట్లు రైల్వే శాఖ అధికారులు పేర్కొన్నారు. గత నవంబర్ నుంచి రాయదుర్గం మీదుగా తిరుపతి వెళ్లే రైలు ఆగిపోయిందని దానిని పునరుద్ధరించాలని కోరారు. రాయదుర్గం స్టేషన్​లో ఎక్స్​ప్రెస్ రైళ్లు ఆపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.